KGF 3 | కేజీఎఫ్ 3 పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌...ఈ ఏడాది సెట్స్ పైకి రానున్నట్లు వెల్లడి-producer vijay kiragandur reveals kgf 3 shoot begins date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kgf 3 | కేజీఎఫ్ 3 పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌...ఈ ఏడాది సెట్స్ పైకి రానున్నట్లు వెల్లడి

KGF 3 | కేజీఎఫ్ 3 పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌...ఈ ఏడాది సెట్స్ పైకి రానున్నట్లు వెల్లడి

HT Telugu Desk HT Telugu
May 14, 2022 01:19 PM IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్ 3ని రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూడోభాగం షూటింగ్ ఎప్పుడూ మొదలుపెట్టనున్నది చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ వెల్లడించారు.

<p>యశ్&nbsp;</p>
యశ్ (twitter)

యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి అన్ని భాషల సినిమాల రికార్డులను బద్దలుకొడుతూ దూసుకుపోతున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ భారతీయ సినీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూడో సినిమాగా నిలిచింది. హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా చరిత్రను తిరగరాసింది. 

ఈ సినిమాకు మూడో భాగాన్ని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో భాగం క్లైమాక్స్ ఎపిసోడ్ లో పార్ట్ 3కు సంబంధించిన ప్రకటనను వెల్లడించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. కేజీఎఫ్ 3 ఎప్పుడు ప్రారంభమవుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పార్ట్ 3 గురించి నిర్మాత విజయ్ కిరగందూర్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. 

అక్టోబర్ నెలలో కేజీఎఫ్ 3 షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. 2024 లో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.  మార్వెల్ తరహాలో కేజీఎఫ్ ఫ్రాంచైజ్ ద్వారా  ఇండియన్ స్క్రీన్ పై కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లు వెల్లడించారు.  డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సినిమాల మాదిరిగా ప్రతి పార్ట్ లో కొత్త పాత్రలను ప్రవేశపెడుతూ ఆసక్తికరంగా కేజీఎఫ్ తదుపరి భాగాలను తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. 

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో షూటింగ్ తో బిజీగా ఉన్నారని, ఈ సినిమా పూర్తి కాగానే కేజీఎఫ్ 3 ని సెట్స్ పైకి తీసుకొస్తామని వెల్లడించారు. సలార్ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. 

Whats_app_banner

సంబంధిత కథనం