CM Revanth: సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీ- చర్చించిన ప్రధాన అంశాలు ఇవే! నాగార్జున, సురేష్ బాబు ఏం మాట్లాడారంటే?-producer suresh babu about otts in cm revanth reddy meeting and tollywood celebrities like nagarjuna comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Cm Revanth: సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీ- చర్చించిన ప్రధాన అంశాలు ఇవే! నాగార్జున, సురేష్ బాబు ఏం మాట్లాడారంటే?

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీ- చర్చించిన ప్రధాన అంశాలు ఇవే! నాగార్జున, సురేష్ బాబు ఏం మాట్లాడారంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 26, 2024 02:55 PM IST

Suresh Babu About OTTs In CM Revanth Reddy Meeting: అల్లు అర్జున్ పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు నేపథ్యంలో ఇవాళ (డిసెంబర్ 26) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీలతో సహా ఇతర అంశాలపై సీఎంతో సినీ పెద్దలు చర్చించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దల భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దల భేటీ

Tollywood Celebrities Meeting With CM Revanth Reddy: పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో (డిసెంబర్ 4) సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంతో పాటు ఇటీవల పోలీసులు విచారించారు.

yearly horoscope entry point

కీలక అంశాలపై చర్చ

ఈ క్రమంలోనే ఇకనుంచి తెలంగాణలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు బెన్‌ఫిట్ షోలకు అనుమతినిచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలుగు సినీ పెద్దలంతా ఒక తాటిపైకి వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ (డిసెంబర్ 26) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలను చర్చించారు. ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను సీఎం రేవంత్‌ రెడ్డితో పంచుకున్నారు.

కేరాఫ్‌గా ఉండాలి

ఈ నేపథ్యంలోనే ఓటీటీలకు సంబంధించిన విషయాలపై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడారు. "ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ఓటీటీ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలి" అని నిర్మాత సురేష్ బాబు సీఎంతో చెప్పారు.

సురేష్ బాబుతో సహా ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు, సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించిన అంశాలేంటో ఇక్కడ చూద్దాం.

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్:

- శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు.

- ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటాం.

- అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే..!

- ఇండస్ట్రీతో ప్రభుత్వం ఉంటుంది.

- తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి.

- డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి.

- టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి.

- ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి.

- ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు.

- అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడే ఉన్నాం.

- ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుంది.

- సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.

-- ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే మా ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుంది.

మురళి మోహన్ కామెంట్స్:

- ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది.

- సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది.

- సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది.

- ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం.

రాఘవేంద్ర రావు కామెంట్స్:

- అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు.

- ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది.

- దిల్‌ రాజును FDC ఛైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా.

- తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయి.

- గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో చేశారు.

- ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం.

నాగార్జున కామెంట్స్:

- యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలి.

- ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది.

- హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక.

నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కామెంట్స్:

- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.

- నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను.

-హైదరాబాద్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాలి.

కాగా సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో టాలీవుడ్ సెలబ్రిటీలు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, హీరో నాగార్జున, వెంకటేష్, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ, నితిన్, రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్, హరీష్ శంకర్, నాగవంశీతోపాటు మొత్తంగా 36 మంది పాల్గొన్నట్లు సమాచారం.

Whats_app_banner