Custody Press meet: చైతన్య కెరీర్‌లోనే కస్టడీ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.. అతడికి ఇది మరో శివ.. నిర్మాత స్పష్టం-producer srinivasaa chitturi says custody movie highest budget movie in naga chaitanya career ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Custody Press Meet: చైతన్య కెరీర్‌లోనే కస్టడీ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.. అతడికి ఇది మరో శివ.. నిర్మాత స్పష్టం

Custody Press meet: చైతన్య కెరీర్‌లోనే కస్టడీ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.. అతడికి ఇది మరో శివ.. నిర్మాత స్పష్టం

Maragani Govardhan HT Telugu
May 11, 2023 06:23 AM IST

Custody Press meet: నాగచైతన్య కెరీర్‌లో కస్టడీ చిత్రం హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని సదరు చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అన్నారు. అంతేకాకుండానాగార్జునకు శివ ఎలాగో చైతూకు అలాంటి కస్టడీ అలా మిగిలిపోతుందని తెలిపారు.

కస్టడీ నిర్మాత శ్రీనివాసా చిట్టూరి
కస్టడీ నిర్మాత శ్రీనివాసా చిట్టూరి

Custody Press meet: యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు-తమిళంలో ఏక కాలంలో విడుదల కానుంది. కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కస్టడీ మూవీ గురించి నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కస్టడీ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.

"కస్టడీ సినిమా ఓ నిజాయితీ గల కానిస్టేబుల్ కథ. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో సీరియస్ కథ జరుగుతుంటుంది. సీరియస్‌లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ రెండిటిని దర్శకుడు మిక్స్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. తెలుగు ఎమోషన్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది." అని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అన్నారు.

సంగీతం గురించి మాట్లాడుతూ ఇళయారాజా.. కథ విని వెంటనే ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. ఇది 90వ దశకంలో జరిగే కథ అని.. అందుకే ఇళయరాజాను తీసుకున్నామని, ఆయనతో పాటు యువన్ కూడా చేరడం ఆనందాన్ని కలిగించినట్లు తెలిపారు.

సినిమా ఔట్ పుట్ గురించి మాట్లాడుతూ.. "చైతన్య కెరీర్‌లోనే హయ్యస్ట్ ఫిల్మ్ అవుతుంది. నాగార్జున గారి కెరీర్‌లో ‘శివ’ ఎలా గుర్తుండి పోయిందో నాగచైతన్య కెరీర్‌లో కస్టడీ అలా గుర్తుండిపోతుంది. శివ సినిమానే కాదు అందులో పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. కస్టడీలోని అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి.. పాత్రలు గుర్తుండిపోతాయి. ప్రతి పాత్ర యూనిక్‌గా ఉంటుంది" అని అన్నారు.

అప్ కమింగ్ ప్రాజెక్టులు గురించి మాట్లాడుతూ.. "బోయపాటి-రామ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. టీజర్ రామ్ పుట్టినరోజున విడుదల చేస్తాం. అలాగే నాగార్జున గారితో చేసే సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుకానుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. కస్టడీ-2 కూడా ఉంటుంది." అని తెలిపారు.

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. కస్టడీ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

టాపిక్