Producer SKN: తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే..: నిర్మాత ఎస్‍కేఎన్ వివాదాస్పద కామెంట్లు.. ఆ హీరోయిన్ గురించేనా!
Producer SKN on Telugu Heroins: నిర్మాత ఎస్‍కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు వచ్చిన అమ్మాయిలకు ఇవి అవకాశం ఇవ్వకూడదని అనుకుంటున్నామని మాట్లాడారు. మరిన్ని కామెంట్లు చేశారు. వీటిపై విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇవే..

బేబి సినిమాతో 2023లో భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు నిర్మాత ఎస్‍కేఎన్ (శ్రీనివాస్ కుమార్). ఆనంద్ దేవరకొండ, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఆ మూవీ భారీ హిట్ అయింది. కల్ట్ ప్రొడ్యూజర్ అంటూ ఎస్‍కేఎన్ పేరు తెచ్చుకున్నారు. తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎస్‍కేఎన్ వివాదాస్పదన వ్యాఖ్యలు చేశారు. తెలుగు హీరోయిన్లుపై షాకింగ్ కామెంట్ చేశారు. ఏమన్నారంటే..
ఏమవుతుందో నాకు తెలిసింది
తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తనకు ఏం జరుగుతుందో తెలిసి వచ్చిందని ఎస్‍కేఎన్ అన్నారు. “ తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే.. తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తర్వాత తెలిసింది. అందుకని తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ కల్ట్ సాయి రాజేశ్ కోరుకుంటున్నాం” అని ఎస్‍కేఎన్ అన్నారు.
కాయద్ పేరుపై కూడా అభ్యంతర కామెంట్
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హీరోయిన్ కావ్యదు లోహర్ పేరుపై కూడా కాస్త అభ్యంతకర కామెంట్ చేశారు నిర్మాత ఎస్‍కేఎన్. ఆవిడ పేరు అని గుర్తులేనట్టు నటిస్తూ.. తెలుగులో కాయలు, పండ్లకు వేర్వేరు అర్థాలు ఉన్నాయని కామెంట్ చేశారు. ఇది మంచి అర్థమే అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తెలుగు రాని అమ్మాయినే ఎక్కువ లవ్ చేస్తామని కామెంట్లు చేశారు.
నెటిజన్ల నుంచి తీవ్రంగా విమర్శలు
తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయనంటూ నిర్మాత ఎస్‍కేఎన్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూ.. సొంత భాష అమ్మాయిలను తీసుకోబోమని వేదికపైనే చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. బేబి హిట్ అయ్యేందుకు తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యనే ప్రధాన కారణం అని, అలాంటప్పుడు ఈ కామెంట్‍కు అర్థమైంటని చాలా మంది అంటున్నారు. ఎస్‍కేఎన్ ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
వైష్ణవి చైతన్య గురించేనా!
వైష్ణవి చైతన్యను దృష్టిలో పెట్టుకొనే నిర్మాత ఎస్‍కేఎన్ ఈ కామెంట్లు చేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తమ చిత్రాలు కాకుండా.. వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని ఆమెపై కోపంగా ఉన్నారా అని కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వేదికపై ఆలోచించి మాట్లాడాలని, అసలు తెలుగు అమ్మాయిలకే అవకాశాలు ఇవ్వాలని అనుకోవడం లేదంటూ ఏదేదో మాట్లాడితే ఎలా అని నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. అలాగే, డ్రాగన్ హీరోయిన్ కాయద్‍పై చేసిన కామెంట్లపైనా కొందరు ఫైర్ అవుతున్నారు. వేదికపై ఉన్నామని మరిచిపోయి కాయలు, పండ్లు అంటూ అసభ్యమైన అర్థం వచ్చేలా మాట్లాడడం ఏంటని మండిపడుతున్నారు.
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ చిత్రం ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహల్ హీరోయిన్లుగా నటించారు. ఈ కామెడీ డ్రామా మూవీకి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు అతిథిగా హాజరైన ఎస్‍కేఎన్ ఈ వివాదాస్పద కామెంట్లు చేశారు.
సంబంధిత కథనం