ఐసీయూలోకి వచ్చిన పేషంట్‌కు పెడీక్యూర్, ఫేషియల్ చేయాలనుకోవద్దు.. రాజా సాబ్ అప్డేట్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్-producer skn comments on theater prices and prabhas the raja saab update in ghatikachalam trailer launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఐసీయూలోకి వచ్చిన పేషంట్‌కు పెడీక్యూర్, ఫేషియల్ చేయాలనుకోవద్దు.. రాజా సాబ్ అప్డేట్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్

ఐసీయూలోకి వచ్చిన పేషంట్‌కు పెడీక్యూర్, ఫేషియల్ చేయాలనుకోవద్దు.. రాజా సాబ్ అప్డేట్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

బేబీ సినిమాతో నిర్మాతగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఎస్‌కేఎన్. తాజాగా ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్న సినిమా ఘటికాచలం. హారర్ సస్పెన్స్ జోనర్‌లో తెరకెక్కిన ఘటికాచలం మూవీని ఎంసీ రాజు నిర్మించారు. మే 23న జరిగిన ఘటికాచలం ట్రైలర్ లాంచ్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఐసీయూలోకి వచ్చిన పేషంట్‌కు పెడీక్యూర్, ఫేషియల్ చేయాలనుకోవద్దు.. రాజా సాబ్ అప్డేట్‌పై నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్

నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సినిమా "ఘటికాచలం". ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎంసీ రాజు నిర్మించారు. "ఘటికాచలం" చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి.

ఘటికాచలం ట్రైలర్ లాంచ్

ఘటికాచలం సినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల అంటే మార్చి 31న "ఘటికాచలం" సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మే 23న ఘటికాచలం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఘటికాచలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కథలో లీనమయ్యేలా

ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. "ఘటికాచలం సినిమాను మారుతి గారు చూసి బాగుందని చెబితే నేనూ చూశాను. నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ రాజు గారు మంచి స్టోరీ ఇచ్చారు. అలాగే ఇటాలియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్లేవియో సంగీతం సినిమాలో మనల్ని లీనమయ్యేలా చేస్తుంది" అని అన్నారు.

పది నిమిషాల్లోనే కథలోకి

"సినిమా మొదలైన పది నిమిషాల్లోనే ఆ కథలోకి వెళ్లిపోతాం. మన కళ్ల ముందే యదార్థ ఘటనలు జరుగుతున్నట్లు ఫీల్ అవుతాం. అలా ఎంగేజ్ చేస్తూనే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు. ఇంటెన్స్ సీన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. కొత్త వాళ్లు తమ టాలెంట్ చూపించాలంటే బెస్ట్ ఆప్షన్ హారర్ జోనర్. ఎవరైనా తమ స్టోరీని హారర్ జోనర్‌లో ఎఫెక్టివ్‌గా చెప్పవచ్చు" అని ఎస్‌కేఎన్ తెలిపారు.

హారర్ మూవీస్ ఇష్టపడేవారు

"ఈ నెల 31న ఘటికాచలం సినిమా థియేటర్స్‌లోకి వస్తోంది. హారర్ మూవీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్‌లోనే ఘటికాచలం సినిమాను చూడండి. అప్పుడే హారర్ ఎఫెక్ట్‌లు, బీజీఎంకు బాగా కనెక్ట్ అవుతారు. టికెట్ రేట్స్, పాప్ కార్న్ ధరలు.. ఇలా కొన్నింటి వల్ల థియేటర్స్‌కు ఆడియెన్స్ దూరమవుతున్నారు" అని ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ చెప్పుకొచ్చారు.

రెండు వారాల్లోపే

"థియేటర్స్‌కు ఎక్కువమంది ఆడియెన్స్‌ను తీసుకొచ్చేలా మన ఇండస్ట్రీ పెద్దలు ఆలోచనలు చేయాలి. అలా జరిగితే మిగతా అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి. ఐసీయూలోకి వచ్చిన పేషెంట్‌కు ముందు పెడీక్యూర్, ఫేషియల్ చేయాలని అనుకోకూడదు, లైఫ్ కాపాడే ప్రయత్నం చేయాలి. ముందు మన సినిమాను థియేట్రికల్‌గా కాపాడుకోవాలి. మరో రెండు వారాల్లోపే రాజా సాబ్ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది" అని నిర్మాత ఎస్‌కేఎన్ వెల్లడించారు.

కీలకంగా ఉంటుంది

ఇదే ఈవెంట్‌లో నటుడు రంగధామ్ మాట్లాడుతూ .. "ఘటికాచలం చిత్రంలో నేను చిన్న రోల్ చేశాను. పాత్ర చిన్నదే అయినా నా క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అమర్ గారికి థ్యాంక్స్. మా చిత్రాన్ని మారుతి గారు, ఎస్‌కేఎన్ గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది" అని తెలిపారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం