మా సినిమాలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే.. పిడికిలిగా మారడానికి రెడీ.. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్-producer skn comments on allu aravind in chithra mandali teaser launch event director kv anudeep speech ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మా సినిమాలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే.. పిడికిలిగా మారడానికి రెడీ.. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్

మా సినిమాలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే.. పిడికిలిగా మారడానికి రెడీ.. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

బేబీ సినిమాతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎస్‌కేఎన్. ఇటీవల జరిగిన చిత్ర మండలి టీజర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ పాల్గొన్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్, నిహారిక ఎమ్ నటించిన చిత్ర మండలి టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మా సినిమాలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే.. పిడికిలిగా మారడానికి రెడీ.. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్

బేబి మూవీతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్. ఇటీవల జరిగిన చిత్ర మండలి మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యారు నిర్మాత ఎస్‌కేఎన్. ఈ చిత్ర మండలి సినిమాను బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది.

సినీ ప్రముఖుల హాజరు

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎమ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్ర మండలి సినిమాక విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. అయితే, రీసెంట్‌గా చిత్ర మండలి టీజర్ లాంచ్‌కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారితోపాటు అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ నిర్మాత అల్లు అరవింద్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఏ హోమం చేసినా

నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. "ఏ హోమం చేసినా మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. మా సినిమా వేడుకలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే. నన్ను, బన్నీ వాసుని ఆయన బిడ్డల్లాగే చూసుకుంటారు. చేతి ఐదు వేళ్లు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ, కలిసే ఉంటాయి" అని అన్నారు.

పిడికిలిగా మారడానికి సిద్ధం

"అరవింద్ గారు ప్రోత్సహించిన కుటుంబం మేము. మేమంతా ఎప్పుడూ కలిసే ఉంటాం. ఆయన కోసం మేము పిడికిలిగా మారడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఈ మిత్ర మండలి టీజర్ చూస్తుంటే జాతి రత్నాలు, మ్యాడ్, ఆయ్, సింగిల్ సినిమాల వైబ్ వస్తుంది. అవన్నీ హిట్ సినిమాలే. మిత్ర మండలి వాటిని మించిన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత ఎస్‌కేఎన్ తెలిపారు.

రైటింగ్ క్రేజీగా ఉంటుంది

ఇదే ఈవెంట్‌కు అతిథిగా వచ్చి దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ.. "ఈ మిత్ర మండలి చిత్ర దర్శకుడు విజయ్ నాకు స్నేహితుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఈ స్టోరీ రెడీ చేసుకున్నాడు. రైటింగ్ క్రేజీగా ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న బన్నీ వాస్ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్" అని అన్నారు.

ఎంతో ఎనర్జీ ఇచ్చింది

"అల్లు అరవింద్ గారు మా టీజర్ లాంచ్‌కి చాలా సంతోషంగా ఉంది. ఆయన రాక మా అందరికీ ఎంతో ఎనర్జీ ఇచ్చింది. అలాగే, అనుదీప్ గారు మాకు రైటింగ్ పరంగా ఎంతో సహాయం అందించారు. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నమ్మకంగా ఉన్నాము" అని చిత్ర మండలి నిర్మాత భాను ప్రతాప పేర్కొన్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం