Producer Sivalenka Krishna Prasad About Priyadarshi: ఆదిత్య. 369, నాని జెంటిల్‌మెన్, సమ్మోహనం, యశోద వంటి సినిమాలను నిర్మించిన టాలీవుడ్ పాపులర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ తాజాగా నిర్మించిన తెలుగు మూవీ సారంగపాణి జాతకం.
కోర్ట్ మూవీ తర్వాత కమెడియన్, హీరో ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం సినిమాకు డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘సారంగపాణి జాతకం‘. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్-మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది.
ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రం సారంగపాణి జాతకం అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే, యూత్‌ను ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు కూడా ఇందులో ఉన్నాయన్నారు. అయితే, ఏప్రిల్ 18న సారంగపాణి జాతకం సినిమా విడుదల కావాల్సింది. కానీ, ఏప్రిల్ 25కు వాయిదా వేస్తున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. ప్రెస్ మీట్ నిర్వహించి అందుకు గల కారణాలు చెప్పారు.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. "సారంగపాణి జాతకం మా శ్రీదేవి మూవీస్ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే సినిమా అవుతుంది. కంప్లీట్ ఎంటర్‌టైనర్ తీయాలనే నా కోరిక ఈ సినిమా తో నెరవేరింది. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ అయింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి" అని అన్నారు.
"ఈ నెల 25న మీకు రెట్టింపు ఆనందాన్ని కలిగించే విధంగా మా సారంగ పాణి జాతకం థియేటర్లలో విడుదల కానుంది. నిజానికి 18న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు, మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం 25న వస్తున్నాం. బలగం, 35 చిన్న కథ కాదు, కోర్టు సినిమాలతో ప్రియదర్శి రేంజ్ పెరిగింది. మిమ్మల్ని ఈ సినిమాతో 100 శాతం ఎంటర్టైన్ చేస్తారాయన" అని నిర్మాత తెలిపారు.
"నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ 'నాని జెంటిల్‌మన్', ఆ తర్వాత చక్కని ప్రేమకథతో సుధీర్‌బాబు 'సమ్మోహనం' చేశాను. ఈ రెండూ కూడా మంచి పేరు, సక్సెస్ తెచ్చాయి. ఇప్పుడు ఆ విజయాలను ‘సారంగపాణి జాతకం’ కొనసాగిస్తుంది. ఇలాంటి సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను" అని ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, సారంగపాణి జాతకం సినిమాలో ప్రియదర్శి పులికొండకు జోడీగా రూప కొడువాయూర్ హీరోయిన్ నటించింది. అలాగే, ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్ ఇతరులు నటించారు.
సంబంధిత కథనం