Laila: అడల్ట్ కామెడీలా ఉంది, హిందీలో ఎక్కువగా వర్క్ అవుతాయి కదా: విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రశ్నపై నిర్మాత ఆన్సర్ ఇదే!
Producer Sahu Garapati On Vishwak Sen Laila Is Adult Comedy Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తొలిసారి లేడి గెటప్‌తో నటించిన యాక్షన్ కామెడీ మూవీ లైలా. ఈ మూవీ అడల్ట్ కామెడీలా అనిపిస్తోంది, ఇలాంటివి ఎక్కువగా బాలీవుడ్‌లో వర్క్ అవుతాయన్న ప్రశ్నకు లైలా నిర్మాత సాహు గారపాటి సమాధానం ఇచ్చారు.

Producer Sahu Garapati About Vishwak Sen Laila Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ లైలా. ప్రస్తుతం లైలా ఎగ్జయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.
లైలా రిలీజ్ డేట్
లైలా మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే లైలా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్‌గా విడుదలైన లైలా ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకుని ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు.
లైలా సినిమా నిర్మించడానికి మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటీ?
-మెయిన్ కామెడీ. దీంతో పాటు ఒక హీరో ఇలాంటి కథని చేస్తానని యాక్సప్ట్ చేయడం నాకు చాలా నచ్చింది. అంతకుముందు కొందరు హీరోలని సంప్రదించాం. లేడి గెటప్ చేయడం అంత ఈజీ కాదు. విశ్వక్ సేన్ చేస్తానని చెప్పడంతో నాకూ ఇంట్రస్ట్ కలిగి ముందుకు తీసుకెళ్లాం.
-ఇలాంటి కథలు వచ్చి చాలా కాలమైయింది. డెఫినెట్‌గా బావుంటుదని నమ్మి ముందుకు వెళ్లాం. విశ్వక్ సేన్ చాలా జీల్ ఉన్న యాక్టర్. ఈ కథ విన్నవెంటనే 'అన్న ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్' అని చెప్పారు. ఇందులో లవ్ స్టొరీతో పాటు ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.
లైలా, సోను క్యారెక్టర్స్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది?
-ఫస్ట్ హాఫ్ అంతా సోను ఉంటాడు. తన లవ్ స్టొరీ ఫస్ట్ హాఫ్‌లో ఉంటుంది. అనుకోని కారణంగా తనని లైలాగా మార్చుకొని ఇన్నోసెన్స్‌ని ప్రూవ్ చేసుకుంటాడు. ఆ రీజన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. విశ్వక్ సేన్ లైలా గెటప్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అందరూ లుక్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని అంటున్నారు. నా వరకూ లైలాకే ఎక్కువ మార్కులు వేస్తాను.
లైలా ట్రైలర్ చూస్తుంటే అడల్ట్ కామెడీ అనిపిస్తోంది. ఇలాంటివి బాలీవుడ్‌లో ఎక్కువగా వర్క్ అవుతాయి కదా?
-అడల్ట్ కామెడీ అన్ని చోట్ల ఉంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే కనిపించేదంతా అదే కదా. దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. హీరో లేడీ క్యారెక్టర్, కొందరికి అర్ధం కాని డెక్కన్ లాంగ్వేజ్ మాట్లాడటం వలన 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ, సినిమాలో అడల్ట్ కామెడీ అంటూ ఏమీ లేదు. రెగ్యులర్‌గా మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది.
యూత్‌ని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది?
-యూత్‌ని టార్గెట్ చేశాం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. నవ్వించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. అందులో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం.
సంబంధిత కథనం