తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంటుతమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ మమితా బైజు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇటీవల డ్యూడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్, నటుడు శరత్ కుమార్ కామెంట్స్ చేశారు.
తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న తమిళ హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో అలరించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మరో లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఇందులో ప్రదీప్‌కు జోడీగా హీరోయిన్ మమితా బైజు నటించింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమాతో కీర్తిశ్వరన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన డ్యూడ్ మూవీ ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన డ్యూడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రదీప్, మమితా బైజు, శరత్ కుమార్ గారు ఒకరికి మించి ఒకరు పెర్ఫార్మ్ చేశారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది" అని అన్నారు.
"డ్యూడ్ ట్రైలర్‌లో కేవలం సినిమా వైబ్ మాత్రమే ప్రజెంట్ చేశాం. చాలా కంటెంట్ ఉంది. మీరు మాగ్జిమం ఎంజాయ్ చేస్తారు. తెలుగు, తమిళంలో సినిమా వస్తుంది. సాంగ్స్ పెద్ద హిట్. సాయి అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. డైరెక్టర్ కీర్తి చెప్పిన దానికంటే అద్భుతంగా తీశారు" అని నిర్మాత రవిశంకర్ తెలిపారు.
"ఇందులో హీరో హీరోయిన్ మధ్య సీన్స్ మామూలుగా ఉండవు. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. దీపావళికి వస్తున్న కిరణ్ అబ్బవరం గారి సినిమా, మిత్రమండలి, తెలుసు కదా చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని డ్యూడ్ నిర్మాత రవిశంకర్ పేర్కొన్నారు.
యాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. డ్యూడ్ సినిమా ఒక మంచి వైబ్. ట్రైలర్‌లో మీరు చూసింది 10 శాతమే. ఈ సినిమా గ్యారంటీ హిట్టు. ఈ సినిమాలో చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. చాలా కొత్త కథ ఇది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది" అని అన్నారు.
"రవి గారికి థాంక్యూ. ప్రదీప్ ఈ సినిమాతో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాడు. ఇది హోల్సమ్ ఎంటర్‌టైనర్. దీపావళికి వస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్‌లో డ్యూడ్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను" అని నటుడు శరత్ కుమార్ కోరారు.
సంబంధిత కథనం