Naga Vamsi on Nepotism: టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ మరోసారి నోరు జారి విమర్శల పాలవుతున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు నెపోజిటమే(బంధుప్రీతి) లేదని అతడు అనడం గమనార్హం. నందమూరి, అక్కినేని, కొణిదెల, ఘట్టమనేనిలాంటి వంశాలు ఎన్నో దశాబ్దాలుగా తెలుగు తెరను ఏలుతున్నా నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.
“తెలుగులో పెద్దగా నెపోటిజం లేదు. తమిళం గురించి తెలియదు. మలయాళం గురించి తెలియదు. నాకు తెలియని ఇతర భాషల గురించి నేను మాట్లాడను. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నెపోటిజం అనే లేనే లేదు. నన్ను నమ్మండి” అని నాగవంశీ అన్నాడు.
తన వాదనను సమర్థించుకోవడానికి నాగవంశీ పలువురు హీరోల ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చాడు. “నెపోటిజం వల్ల తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటిది జరిగింది అని ఒక్కటి చెప్పండి. ఒకవేళ తెలుగు ఇండస్ట్రీ నెపోటిజం ఎక్కువగా ఉంటే.. నాని అంత పెద్ద స్టార్ అయి ఉండేవాడు కాదు. విజయ్ దేవరకొండ, సిద్దూ జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, అడవి శేష్, నితిన్ శర్వానంద్, వీళ్లెవరూ అంత పెద్ద స్టార్లు అయి ఉండేవారు కాదు. వీళ్లెవరూ నెపో కిడ్ కాదు” అని నాగవంశీ అన్నాడు.
అదే సమయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ కేవలం నెపో కిడ్స్ కావడం వల్లే ఈ స్థాయికి ఎదగలేదని, వాళ్లు ఎంతో కష్టపడ్డారని కూడా ఈ సందర్భంగా అతడు స్పష్టం చేశాడు.
అయితే నిర్మాత నాగవంశీ కామెంట్స్ పై టాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టాలీవుడ్ లో నెపోటిజం లేకపోతే వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్ కు సినిమాకు రూ.50 కోట్లు ఎందుకిస్తున్నారని, అదే సంగీత్ శోభన్ కు అవకాశాలు ఎందుకు రావడం లేదని ఓ అభిమాని ప్రశ్నించాడు. నెపోటిజం లేదు అనడం అతిపెద్ద జోక్ అని మరొకరు కామెంట్ చేశారు.
నెపోటిజం లేకపోతే అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అంతా ఎవరని ఒకరు ప్రశ్నించారు. వంశ వృక్షాలతోనే మొత్తం టాలీవుడ్ నడుస్తోందని, జూనియర్ ఎన్టీఆర్ తొలినాళ్లలోని సినిమాలు చూస్తే ఇది అర్థమవుతుందని మరో అభిమాని అభిప్రాయపడ్డారు. నాగవంశీ కూడా నెపోకిడ్ అని, ప్రొడ్యూసర్ సూర్యదేవర రాధా కృష్ణ ద్వారానా ఇండస్ట్రీలోకి వచ్చిన విషయాన్ని మరొకరు గుర్తు చేస్తున్నారు.
సంబంధిత కథనం