Arjun Reddy Deleted Scenes: అర్జున్ రెడ్డి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - డిలీటెడ్ సీన్స్ రిలీజ్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ
Arjun Reddy Deleted Scenes: అర్జున్‌రెడ్డి సినిమాలోని 35 నిమిషాల నిడివితో కూడిన డిలీటెడ్ సీన్స్ రిలీజ్‌పై ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ డిలీటెడ్ సీన్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే...
Arjun Reddy Deleted Scenes: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్‌రెడ్డి మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి శనివారం నాటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని సాధించింది. ప్రేమలో విఫలమైన ధిక్కార మనస్తత్వమున్న యువకుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్ మూవీలో ఒకటిగా అర్జున్ రెడ్డి నిలవడమే కాకుండా విజయ్ దేవరకొండకు స్టార్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. అర్జున్ రెడ్డి రిలీజై ఆరేళ్లు పూర్తయిన ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ వంగాతో పాటు అతడి సోదరుడు నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా సినిమా అనుభవాల్ని, సక్సెస్ ఇచ్చిన కిక్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఈ సినిమాలోని డిలీటెడ్ సీన్స్‌పై ప్రొడ్యూసర్ ప్రణయ్ వంగా ఆసక్తికర ఆప్‌డేట్‌ను రివీల్ చేశాడు. దాదాపు 35 నిమిషాల నిడివితో కూడిన డిలీటెడ్ సీన్స్‌ను తప్పకుండా రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. డిలీటెడ్ సీన్స్ రిలీజ్ పై ఇప్పటికే ప్రతిరోజు మెసేజ్‌లు వస్తూనే ఉంటాయని ప్రణయ్ వంగా తెలిపాడు.
ఈ సీన్స్ ఎడిటింగ్, డబ్బింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కంప్లీట్ చేయడానికి కొంత సమయం పడుతుందని అన్నాడు. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అర్జున్‌రెడ్డిని మాస్టర్ పీస్‌గా మలిచిన డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా టైమ్ కూడా కావాల్సి ఉంది. వీటన్నింటి వల్లే డిలీటెడ్ సీన్స్ రిలీజ్ అలస్యమవుతోంది అని ప్రణయ్ వంగా ప్రకటించాడు.
ప్రణయ్ వంగా ప్రకటనతో అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు. ప్రస్తుతం సందీప్ వంగా బాలీవుడ్‌లో యానిమల్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. రణ్‌భీర్‌కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్, అల్లు అర్జున్‌తో మరో మూవీ కమిట్ అయ్యాడు సందీప్ వంగా.