తెలుగు చిత్ర పరిశ్రమల్లోని అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దిల్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన దిల్ రాజు మళ్లీ నితిన్‌తో నిర్మించిన మూవీ తమ్ముడు. జూన్ 11న తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ ముద్దుల మావయ్య మూవీతో తమ్ముడుని పోల్చడం, నితిన్ రెమ్యునరేషన్‌పై మాట్లాడారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "మా సంస్థలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేద్దామా అని ఎదురుచూశాం. ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ కథ అనుకున్నప్పుడే విజువల్, సౌండింగ్ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. అన్నట్లుగానే చాలా కష్టపడి చేశాడు" అని అన్నారు.
"ఈ సినిమా ముద్దుల మావయ్య (బాలకృష్ణ మూవీ)లా ఉంటుందా అని మన మీడియా మిత్రులు అడుగుతున్నారు. ఇది అక్కా తమ్ముడి మధ్య జరిగే కథ. అయితే కొత్త కాన్సెప్ట్ మూవీ. దీనికి రిఫరెన్స్ లేదు. తమ్ముడు ట్రైలర్ చూశారు. మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపు థియేటర్‌లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని, తమ్ముడు మూవీనే ఒక రిఫరెన్స్‌గా ఉంటుందని నమ్ముతున్నాం" అని దిల్ రాజు తెలిపారు.
"సిస్టర్ క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు శ్రీరామ్ వేణు యూఎస్‌లో ఉన్న లయ గారిని అప్రోచ్ అయి, స్క్రిప్ట్ చెప్పి ఒప్పించాడు. లయ గారు మా సంస్థ ద్వారా మళ్లీ ఇండస్ట్రీకి రావడం హ్యాపీగా ఉంది. కాంతార తర్వాత సప్తమి గౌడను మంచి క్యారెక్టర్‌కు సెలెక్ట్ చేశాడు వేణు" అని దిల్ రాజు పేర్కొన్నారు.
"నితిన్‌కు తమ్ముడు మూవీ చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ బాగుందంటూ మన మీడియా మిత్రుల నుంచి ఫోన్స్ , మెసేజెస్ వస్తున్నాయి. మేము ఎగ్జామ్ రాశాం. జూలై 4న రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా మా మూవీ ఆడియెన్స్‌కు నచ్చుతుందని నమ్ముతున్నాం" అని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఈ రోజు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు తీసుకురావడం కష్టంగా ఉంది. మా ట్రైలర్ నచ్చింది కాబట్టి మీడియా మిత్రులు మా మూవీకి బాగా ప్రచారం కల్పించారు. గత ఆరు నెలల్లో నాలుగైదు సినిమాలు మాత్రమే ఆదరణ పొందాయంటే థియేట్రికల్‌గా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మా డైరెక్టర్, హీరో, ఇతర టీమ్ అంతా ఒక మంచి మూవీ చేసేందుకు కష్టపడ్డారు. థియేట్రికల్‌గా ఎంజాయ్ చేయాల్సిన సినిమా తమ్ముడు. మీరు తప్పకుండా మూవీని ఎంజాయ్ చేస్తారు" అని దిల్ రాజు అన్నారు.
"తమ్ముడు మేకింగ్ టైమ్‌లో టెక్నికల్‌గా క్వాలిటీ కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సివచ్చింది. వేణును పిలిచి అడిగితే ఈ సినిమాకు విజువల్, సౌండ్ క్వాలిటీగా చేస్తున్నామని అన్నాడు. బడ్జెట్ గురించి చెప్పగానే, నేను ఇప్పటినుంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేయను అన్నాడు" అని దర్శకుడి గురించి చెప్పారు దిల్ రాజు.
"అలాగే నితిన్‌కు ఫోన్ చేసి పరిస్థితి చెబితే రాజు గారు మీరు ఎంత పంపిస్తారో పంపించండి నా రెమ్యునరేషన్ గురించి పెద్దగా డిమాండ్ చేయను అన్నారు. ప్రొడ్యూసర్ పరిస్థితి తెలుసుకుని డైరెక్టర్, హీరో ఇలా సపోర్ట్ చేయడం గొప్ప విషయం. ఇది ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని తీసుకురావాలి. సినిమా సక్సెస్ అయితే అందరి రెమ్యునరేషన్స్ పెరుగుతాయి. కానీ, ఫ్లాప్ వస్తే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు" అని దిల్ రాజు వివరించారు.
"తమ్ముడు మూవీ ట్రైలర్‌కు జెన్యూన్‌గా ఎన్ని వ్యూస్ వస్తాయో అంతే చెప్పాలనుకున్నాం. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. తెలుగు సినిమా నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఈ పొజిషన్‌ను కాపాడాలంటే అందరం కష్టపడాలి. ప్రతి సినిమాను జెన్యూన్‌గా ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. అందుకు మీడియా మిత్రుల సపోర్ట్ కూడా కావాలి" అని నిర్మాత దిల్ రాజు కోరారు.
సంబంధిత కథనం