Dil Raju: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాంపై దిల్ రాజు కామెంట్స్- అదే బెస్ట్ మూవీగా చెబుతుంటాను అంటూ!-producer dil raju comments on sankranti released movies ram charan game changer daku maharaj sankranthiki vasthunnam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాంపై దిల్ రాజు కామెంట్స్- అదే బెస్ట్ మూవీగా చెబుతుంటాను అంటూ!

Dil Raju: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాంపై దిల్ రాజు కామెంట్స్- అదే బెస్ట్ మూవీగా చెబుతుంటాను అంటూ!

Sanjiv Kumar HT Telugu
Nov 23, 2024 03:09 PM IST

Dil Raju About Sankranti Movies: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి రిలీజయ్యే గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలపై నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాంపై దిల్ రాజు కామెంట్స్- అదే బెస్ట్ మూవీగా చెబుతుంటాను అంటూ!
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాంపై దిల్ రాజు కామెంట్స్- అదే బెస్ట్ మూవీగా చెబుతుంటాను అంటూ!

Dil Raju About Sankranti Movies: హీరో విక్టరీ వెంకటేష్, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మూడోసారి తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.

సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలు

మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ డేట్‌ను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిల్ రాజు ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలపై కామెంట్స్ చేశారు.

డాకు మహారాజ్ కూడా మేమే

"గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం. అలాగే బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ సినిమా కూడా మేమే చేస్తున్నాం. ఈ మూడు సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మొదలుపెట్టినప్పుడే సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యాం" అని దిల్ రాజు అన్నారు.

ఎఫ్2 బెస్ట్ అంటాను

"తను అనుకున్న కథ, క్యారెక్టర్స్‌ని అద్భుతంగా స్క్రీన్ పైకి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమా రషస్ చూసి నాన్ స్టాప్‌గా నవ్వుకున్నాను. నాకు ఎఫ్2 బెస్ట్ సినిమాగా చెబుతుంటాను. అనిల్ క్యాలెండర్‌లో సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ సినిమాగా నిలుస్తుంది" అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

మీనాక్షిది ఎక్సలెంట్ క్యారెక్టర్

"ఐశ్వర్య తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో ఉండబోతుంది. మీనాక్షి ఎక్సలెంట్ క్యారెక్టర్ చేస్తుంది. అలాగే వీటి గణేష్ గారు, నరేష్ గారు అందరూ ఈ సినిమాలో మిమ్మల్ని అలరించబోతున్నారు. బీమ్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. వెంకటేష్ గారితో అక్కడ మా కోలాబరేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఎఫ్2 సంక్రాంతి వచ్చింది. ఎఫ్ 3 తర్వాత సంక్రాంతికి వస్తున్నాంతో పండక్కి వస్తున్నాం" అని దిల్ రాజ్ వెల్లడించారు.

స్పెషల్ డే

"సీతమ్మవాకిట్లో, ఎఫ్2 సినిమాలో ఎలా అయితే సంక్రాంతికి పెద్ద హిట్ అయ్యాయో సంక్రాంతికి వస్తున్నాం కూడా అంత పెద్ద హిట్ కాబోతోంది. వెంకటేష్ గారు ప్రొడ్యూసర్స్ హీరో సురేష్ ప్రొడక్షన్‌లో సినిమా జరిగితే ఎంత కంఫర్టబుల్‌గా జరుగుతుందో అంత కంఫర్టబుల్‌గా ఈ సినిమాని చేశారు. ఒక్క ఇబ్బంది కూడా లేకుండా ఈ సినిమాని చేసుకున్నారు. జనవరి 14 స్పెషల్ డే. 2025 కొట్టబోతున్నాం" అని దిల్ రాజు తన స్పీచ్ ముగించారు.

నా కల నెరవేరింది

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "ఇది నా డ్రీమ్ క్యారెక్టర్. కాప్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది. చాలా ఫన్ ఉన్న క్యారెక్టర్. అనిల్ రావిపూడి గారికి థాంక్స్. వెంకటేష్ గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారి బ్యానర్‌లో వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. మరిన్ని సినిమాలు వారి బ్యానర్‌లో చేయాలని కోరుకుంటున్నాను" అని తెలిపింది.

Whats_app_banner