పైరసీ చేసి 400, వెయ్యి డాలర్స్‌కు సినిమాలను అమ్ముతున్నారు.. నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు.. దిల్ రాజు కామెంట్స్-producer dil raju comments on nithiin thammudu director venu sriram and piracy movie selling prices ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పైరసీ చేసి 400, వెయ్యి డాలర్స్‌కు సినిమాలను అమ్ముతున్నారు.. నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు.. దిల్ రాజు కామెంట్స్

పైరసీ చేసి 400, వెయ్యి డాలర్స్‌కు సినిమాలను అమ్ముతున్నారు.. నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు.. దిల్ రాజు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్‌గా చేసిన ఈ సినిమాకు వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. జూలై 4న తమ్ముడు విడుదల సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

పైరసీ చేసి 400, వెయ్యి డాలర్స్‌కు సినిమాలను అమ్ముతున్నారు.. నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు.. దిల్ రాజు కామెంట్స్

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

థియేటర్స్‌లో కూర్చుని

-పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోంది. థియేటర్స్‌లో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు.

అదే పెద్ద అమౌంట్

-ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాలర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్. కానీ, నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టం అవుతాయని ఆశిస్తున్నాం.

మా మధ్య ఉన్న రిలేషన్

-శ్రీరామ్ వేణు మా సంస్థలో ఆర్య నుంచి వర్క్ చేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా మాతోనే ట్రావెల్ చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు మా దగ్గరనే ఉన్నాడంటే అందుకు మా మధ్య ఉన్న రిలేషన్, వేవ్ వెంగ్త్ కారణం.

డబ్బులతోనే పనులు

-ఇండస్ట్రీలో డబ్బుతోనే పనులు జరుగుతుంటాయి. నాది భిన్నమైన పద్ధతి. నేను వేవ్ లెంగ్త్ కలిసిన వాళ్లతోనే జర్నీ చేస్తుంటాను. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అడ్డాల, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, దశరథ్.. ఇలా డైరెక్టర్స్ మా సంస్థలో వర్క్ చేసి హిట్ చిత్రాలు ఇచ్చారు.

బాండింగ్‌లో కంఫర్ట్

-శ్రీరామ్ వేణు మా సంస్థలోనే ట్రావెల్ అవుతున్నాడంటే అతనికి భారీగా డబ్బు ఇవ్వడం వల్ల కాదు. మాతో ఆయనకు ఒక కంఫర్ట్ ఉంటుంది. అనిల్ రావిపూడితో నాకొక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్‌లో ఒక కంఫర్ట్ ఉంటుంది.

ఆలోచిస్తారు అంతే

-ఈ డైరెక్టర్స్ టాలెంట్ నాకు తెలుసు. కాబట్టి కథ టైమ్‌లో, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నాకు అనిపించినవి అడుగుతా. నేను క్వశ్చన్ అడిగితే ఎందుకు అడిగాడు అని ఆలోచిస్తారు. అంతే గానీ వారి పనిలో ఇంటర్ ఫియర్ కాను.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం