Sai Pallavi: నాగ చైతన్య తనకు గట్టి పోటీ ఇస్తున్నట్లు సాయి పల్లవి చెప్పింది.. నిర్మాత బన్నీ వాసు కామెంట్స్-producer bunny vasu reveals about sai pallavi says naga chaitanya giving tough competition to her in thandel movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: నాగ చైతన్య తనకు గట్టి పోటీ ఇస్తున్నట్లు సాయి పల్లవి చెప్పింది.. నిర్మాత బన్నీ వాసు కామెంట్స్

Sai Pallavi: నాగ చైతన్య తనకు గట్టి పోటీ ఇస్తున్నట్లు సాయి పల్లవి చెప్పింది.. నిర్మాత బన్నీ వాసు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 04, 2025 01:31 PM IST

Bunny Vasu About Sai Pallavi Comments On Naga Chaitanya: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. తనకు నాగ చైతన్య నటనలో గట్టి పోటీ ఇస్తున్నట్లు సాయి పల్లవి చెప్పిందని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!

నాగ చైతన్య తనకు గట్టి పోటీ ఇస్తున్నట్లు సాయి పల్లవి చెప్పింది.. నిర్మాత బన్నీ వాసు కామెంట్స్
నాగ చైతన్య తనకు గట్టి పోటీ ఇస్తున్నట్లు సాయి పల్లవి చెప్పింది.. నిర్మాత బన్నీ వాసు కామెంట్స్

Bunny Vasu About Sai Pallavi Comments On Naga Chaitanya: నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జోడీ కట్టిన ప్రేమకథ సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్ సందర్భంగా తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.

yearly horoscope entry point

నాగ చైతన్య గారికి ఈ కథ ఎప్పుడు చెప్పారు?

-నాలుగేళ్ల క్రితం ఓ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లాను. ఈ మధ్య విన్న మంచి కథ ఏమిటని అడిగారు. అప్పుడు ఈ కథ గురించి చెప్పాను. నాగ చైతన్యకు ఆ పాయింట్ చాలా నచ్చింది. భలే ఉంది మనం చేస్తున్నామని అన్నారు.

- అయితే ఇందులో ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్, సముద్రంలోకి వెళ్లిన తర్వాత నెలల పాటు స్నానం ఉండదు. అంతా ఒరిజినల్‌లా షూట్ చేయాలని అనుకుంటున్నాం.. యాస కూడా ఉంటుందని చెప్పాను. 'నేను వర్క్ చేస్తా'నని చెప్పారు. ఆయన ఈ పాత్ర కోసం మౌల్డ్ అయిన విధానం అద్భుతం. ఆడియన్స్ అందరిని ఫిబ్రవరి 7న చైతు గారు సర్‌ప్రైజ్ ఇస్తారు. చివరి అరగంట కుమ్మేశారు.

-సాయి పల్లవి సినిమా చూసి 'నేను మామూలుగా చేసుకుంటూ వెళ్లాను. చైతు గారు నాకు గట్టి కాంపిటేషన్ ఇస్తున్నారు'అని చెప్పి తనకి మ్యాచ్ అయ్యేలా పర్ఫామెన్స్ ఇచ్చారు. శివుని పాటలో సాయి పల్లవి చైతు డ్యాన్స్ థియేటర్స్‌లో పూనకం తెప్పిస్తుంది.

ఇందులో సిజీ వర్క్ ఉందా?

-ఇందులో తుఫాన్ ఎపిసోడ్ తప్పితే మిగతా సీన్స్ అన్నీ ఒరిజినల్ సముద్రంలోనే షూట్ చేశాం. ప్రతి షాట్ ఒరిజినల్‌గా ఉంటుంది. షామ్ దత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాని కేరళ, మంగళూరు, గోవా, వైజాగ్ ఇలా నెంబర్ అఫ్ లోకేషన్స్‌లో షూట్ చేశాం. ఈ సినిమాకి చేసినంత అవుట్ డోర్ ఏ సినిమాకి చేయలేదు. ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది.

-ఈ కథ చెప్పే విధానం నేచురల్‌గా ఉండాలి. ప్రతి ఫేస్ కొత్తగా ఫ్రెష్‌గా ఉండాలి. అందుకే చాలా వరకూ కొత్త ఫేసెస్‌ని తీసుకున్నాం.

ట్రైలర్‌లో దాదాపుగా కథ చెప్పిన భావన కలిగింది?

-తండేల్ ట్రైలర్‌లో చూసింది తక్కువే. అందరికి తెలియనిది సినిమాలో చాలా ఉంది. జైల్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఎదురుకున్నారో ఎవరికీ తెలీదు. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది.

డైరెక్టర్ చందు గారి గురించి?

-ప్రేమమ్ లాంటి కల్ట్ సినిమా రీమేక్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ సినిమాని ఆయన ప్రజెంట్ చేసిన తీరుకి సర్‌ప్రైజ్ అయ్యాను. తనలో సమ్‌థింగ్ ఉందనిపించింది. సవ్యసాచి తర్వాత ఆయనకి నాకు సింక్ కుదిరింది. లక్కీగా కార్తికేయ 2 తర్వాత ఈ కథ దొరకడం ఆయనకి నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే అయింది.

మీ కంటే అరవింద్ గారు ఎక్కుగా ప్రమోషన్స్‌లో కనిపిస్తున్నారు?

-సినిమా మూడు భాషల్లో రిలీజ్ అవుతుంది. మెయిన్ తెలుగు. హిందీ, తమిళ్ డబ్బింగ్. పోస్ట్ ప్రొడక్షన్‌లో నేను బిజీగా ఉన్నాను. చెన్నై ఈవెంట్‌కి అందుకోలేకపోయాను. అరవింద్ గారు సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూశారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మాకు ఇంత లైఫ్ ఇచ్చిన ఆయన ఇంత ఎంజాయ్ చేస్తుంటే మాకూ ముచ్చటగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం