Thandel: తండేల్ ఆ రాష్ట్రానికి చెందిన పదం, మత్సలేశ్యం ఊరిని బేస్ చేసుకుని తీసుకున్న కథ.. నిర్మాత బన్నీ వాసు కామెంట్స్
Producer Bunny Vasu About Thandel Story And Word: నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్‌గా మరోసారి జత కట్టిన సినిమా తండేల్. ఫిబ్రవరి 7న విడుదల కానున్న తండేల్ స్టోరీ, ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది, నాగ చైతన్య నటనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
Producer Bunny Vasu About Thandel Story And Word: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మరోసారి జోడీ కట్టిన సినిమా తండేల్. హైలీ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించారు.

తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఇక సినిమా రిలీజ్ నేపథ్యంలో సోమవారం (ఫిబ్రవరి 3) నిర్మాత బన్నీ వాసు విలేకరుల సమావేశంలో తండేల్ మూవికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు.
‘తండేల్’ ఎలా స్టార్ట్ అయ్యింది ?
-నా క్లాస్‌మేట్ భాను కో ప్రొడ్యూసర్‌గా కూడా చేస్తాడు. రైటర్ కార్తిక్ దగ్గర ఈ కథ విని బావుందని నా దగ్గరికి తీసుకొచ్చాడు. కార్తిక్ చెప్పిన కథలో ఎసెన్స్ నాకు చాలా నచ్చింది. తనది కూడా మత్సలేశ్యం ఊరు పక్కనే. అక్కడ స్ఫూర్తి పొంది కథని రాసుకున్నాడు. పాయింట్ నాకు చాలా నచ్చింది. కార్తికేయ 2 తర్వాత చందు గారికి ఈ కథ వినమన్నాను. తనకీ చాలా నచ్చింది. అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాం.
- ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. ఈ కథ కోసం కొందరిని కలిసినప్పుడు వారు చెప్పిన కొన్ని విషయాలు గూస్ బంప్స్ తీసుకొచ్చాయి. ఈ విషయాలన్నీ చెప్పడానికి రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ని డైరెక్టర్ చందు డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్స్ ద్వారా జరిగిన కథ చెప్పాం.
-ఇది ప్యూర్ లవ్ స్టొరీ. రాజు, సత్య ప్రేమ కథ చాలా కీలకం. ఆ లవ్ స్టొరీ ద్వారా ఒరిజినల్‌గా జరిగిన స్టొరీని చూపించుకుంటూ వచ్చాం. ఇది యాభై శాతం ఫిక్షన్. యాభై శాతం నాన్ ఫిక్షన్. డైరెక్టర్ గారి విజన్‌ని వందశాతం ఫాలో అయ్యాం.
తండేల్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
- మత్సలేశ్యం అనే ఊరుని బేస్ చేసుకుని తీసుకున్న కథ ఇది. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్‌కి ఫిషింగ్‌కి వెళ్తారు. అక్కడ బొట్లు ఉన్న వారికి బిరుదులు ఉంటాయి. మెయిన్ లీడర్‌ని తండేల్ అంటారు. ఇది గుజరాతీ వర్డ్.
తండేల్ అవుట్ పుట్ చూసి నాగార్జున గారి రెస్పాన్స్ ఏమిటి ?
- రీసెంట్‌గా ఆయన్ని నేను కలవలేదు. అయితే కంటెంట్ ఆయనకి బాగా నచ్చిందని నాగ చైతన్య గారు చెప్పారు.
దేవిశ్రీ మ్యూజిక్ గురించి?
-ఇది రూటెడ్ స్టొరీ. నేచురల్‌గా షూట్ చేశాం. అంత నేచురల్‌గా మ్యూజిక్ కూడా ఉంటుంది. ఇప్పటికే పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
సంబంధిత కథనం