Boyapati Srinu: కథ నచ్చి బోయపాటి శ్రీనుకు బ్లాంక్ చెక్ ఇచ్చిన అగ్ర నిర్మాత.. అసలు విషయం ఇది!
Producer Bellamkonda Suresh On Boyapati Srinu: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఓ స్టార్ నిర్మాత కథ నచ్చి, బ్లాంక్ చెక్ ఇచ్చారని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత బెల్లంకొండ సురేష్. డిసెంబర్ 5న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
Producer Bellamkonda Suresh Clarity: తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బోయపాటి శ్రీను. నందమూరి నటసింహం బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించారు. త్వరలో అఖండ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు.
57వ వసంతంలోకి
ఇదిలా ఉంటే, బోయపాటి శ్రీను చెప్పిన కథ నచ్చి ఓ అగ్ర నిర్మాత బ్లాంక్ చెక్ ఇచ్చారని రూమర్స్ వినిపించాయి. ఆ నిర్మాత ఎవరో కాదు బెల్లంకొండ సురేష్. అయితే, డిసెంబర్ 5న 57వ వసంతంలోకి అడుగుపెడుతూ పుట్టిన రోజు జరుపుకున్నారు బెల్లంకొండ సురేష్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 ఏళ్లపాటు సక్సెస్‌ఫుల్‌గా సినిమాలను నిర్మించారు.
బ్లాంక్ చెక్ ఇవ్వడంపై
ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న పుట్టినరోజు వేడుకల అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పడమే కాకుండా బోయపాటి శ్రీనుకు బ్లాంక్ చెక్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చారు బెల్లంకొండ సురేష్.
నా అటో గ్రాఫ్ రీ రిలీజ్ చేస్తామని గతంలో చెప్పారు ?
-4కేలో రెడీ చేశాను. నెక్ట్స్ రవితేజ బర్త్ డేకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నాఅటో గ్రాఫ్ అద్భుతమైన సినిమా. అందులో పాటలన్నీ ఎవర్ గ్రీన్.
చెన్నకేశవ రెడ్డి రీ రిలీజ్‌కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?
-చెన్న కేశవ రెడ్డి మూవీకి మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్, రెవెన్యూ వచ్చింది. మళ్లీ బాలయ్య బాబుతో వందశాతం సినిమా చేస్తాను.
కథ నచ్చిన తర్వాత మీరు బోయపాటి గారికి బ్లాంక్ చెక్ ఇచ్చారని విన్నాం ?
-లేదండి. బోయపాటి గారు ప్రేమతో వచ్చి నాకు సినిమా చేస్తానని చెప్పారు. రెమ్యునరేషన్ తగ్గించుకొని మరీ చేసిన వ్యక్తి. ఈ విషయంలో బోయపాటి గారు గ్రేట్ పర్సన్. జయ జానకి నాయక హిందీలో డబ్ అయి 900 మిలియన్స్ వ్యూస్‌తో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది.
మీకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ?
-మోహన్ బాబు గారు. నాకు ఎవరూ సపోర్ట్ లేనప్పుడు ఆయన నన్ను సినిమాకి మేనేజర్‌ని చేశారు. ఆయన నా దేవుడు.
కొత్త దర్శకులతో పని చేయాలని ఉందా?
-కొత్త దర్శకులు మంచి సినిమాలతో వస్తున్నారు. సామజవరగమన, క, కమిటీ కుర్రాళ్లు ఇలా మంచి సినిమాలు వచ్చాయి. కథ కుదిరితో అందరితో పని చేయాలని ఉంది.
గతంలో మీరు చాలా మంచి రిమేక్స్‌తో హిట్స్ అందుకున్నారు. ఇప్పుడా ఆలోచనలు ఉన్నాయా?
-ఒక రిమేక్ తీసుకున్నాను. అది తెలుగులో సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. కథ బావుంటే రిమేక్ సినిమాలు కూడా బాగా ఆడుతాయి.
ఈ రోజుల్లో అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయాలనిపించే దర్శకుడు?
-పూరి జగన్నాథ్. ఆయనతో సినిమా చేయాలని ఉంది. హీరోయిజాన్ని మారుస్తాడు. హీరోని ఎలివేట్ చేస్తాడు. 90 రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్‌తో పని చేయాలని ఉంది.