పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ధర్మం కోసం పోరాయేడ యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీనే హరి హర వీరమల్లు. ఈ సినిమాకు ఏ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఇద్దరు దర్శకత్వం వహించారు.
అగ్ర నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో హరి హర వీరమల్లు సినిమాను నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేసిన హరి హర వీరమల్లు జూలై 21న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపేథ్యంలో హరి హర వీరమల్లు సినీ విశేషాలను మీడియా సమావేశంలో నిర్మాత ఏఎం రత్నం పంచుకున్నారు.
-17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది.
-హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని ఇద్దరి దేవుళ్ల కలయికతో పెట్టాము.
-నేను 'భారతీయుడు' సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
-అయితే ఇది పవన్ కల్యాణ్ గారు డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్‌తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది.
-బాగా ఆలస్యమవవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే హరి హర వీరమల్లు ట్రైలర్‌తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నాను.. హరి హర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
సంబంధిత కథనం