Allu Aravind: జైలుకు వెళ్లిన 30 మంది నుంచి హక్కులు తీసుకున్నాం.. నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్-producer allu aravind comments on naga chaitanya sai pallavi thandel movie rights from 30 prisoners in qa press meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Aravind: జైలుకు వెళ్లిన 30 మంది నుంచి హక్కులు తీసుకున్నాం.. నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్

Allu Aravind: జైలుకు వెళ్లిన 30 మంది నుంచి హక్కులు తీసుకున్నాం.. నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Feb 08, 2025 06:38 AM IST

Allu Aravind About Thandel Movie Rights: హీరో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు ముందు ఫిబ్రవరి 6న నిర్వహించిన తండేల్ ప్రీ రిలీజ్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

జైలుకు వెళ్లిన 30 మంది నుంచి హక్కులు తీసుకున్నాం.. నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్
జైలుకు వెళ్లిన 30 మంది నుంచి హక్కులు తీసుకున్నాం.. నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్

Allu Aravind About Thandel Movie Rights: యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన కథాకథానాయికలుగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తండేల్ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదలైన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంటుంది.

గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

అయితే, సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఫిబ్రవరి 6న తండేల్ ప్రీ రిలీజ్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు హీరో నాగ చైతన్య, అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చైతు గారు.. తండేల్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఫ్యాన్స్‌కి ఏం చెబుతారు?

-మేమంతా సినిమా చూశాం. చాలా పాజిటివ్‌గా హ్యాపీగా ఉన్నాం. చివరి ముఫ్ఫై నిముషాలు సినిమా పీక్స్‌లో ఉంటుంది. అంచనాలకు మించి సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ పాలి యేట గురి తప్పేలేదు. రేపొద్దున్న రాజులమ్మ జాతరే.

నాన్న గారు సినిమా చూశారా?

-నాన్న (నాగార్జున) గారు సినిమా చూశారు. ఆయనకి చాలా నచ్చింది. ఆయన డేట్స్ తెలుసుకుంటున్నాం. సక్సెస్ మీట్‌కి తీసుకువెళ్తాం.

అరవింద్ గారు మీరు ఈ సినిమా కథ ముందు విన్నప్పుడు కొన్ని మార్పులు చెప్పారట?

-ముందు కథ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ డాక్యుమెంటరీ నేచర్‌లో ఉంది. అందుకని కథ కొని రైటర్ డైరెక్టర్‌కి ఇస్తే బావుంటుదని అనుకున్నాం. అలాగే జైలుకి వెళ్లిన 30 మందిని స్వయంగా కలిసి వారి నుంచి రైట్స్ తీసుకున్నాం. చందు సినిమా అద్భుతంగా తీర్చిదిద్దారు.

అరవింద్ గారు ఈ సినిమా స్వయంగా మీరే రిలీజ్ చేయడానికి కారణం?

-మా కంట్రోల్‌లో లేని ఏరియాల్లో బయటికి ఇస్తాం తప్పితే మిగతా అంతా మేమే రిలీజ్ చేస్తాం. లాభం, నష్టం మేమే భరించడం గీత ఆర్ట్స్ పాలసీ. మేము తీసిన సినిమా మీద మాకు నమ్మకం. మేము అనుకున్న దానికంటే ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు అయింది. వాసు వచ్చి అమ్మేద్దామా అన్నారు. ఏం పర్వాలేదు మనమే రిలీజ్ చేస్తున్నామని చెప్పా. ‘తండేల్’లో మోస్ట్ సర్‌ప్రైజ్ చైతు పెర్ఫార్మెన్స్. సినిమా సూపర్ హిట్. నేను 4.5 స్టార్స్ ఇస్తాను. రేపు మార్నింగ్ దుల్లకొట్టేద్దాం.

చందు గారు.. ఇది జరిగిన కథ. స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి ఛాలెంజ్ వచ్చింది?

-ఈ ప్రేమకథలోని బ్యూటీ దూరం, ఎడబాటు. తొమ్మిది నెలలు ఓ మనిషి కోసం ఎదురుచూపు, ఆ మనిషి తనకోసం వస్తాడమే నమ్మకం.. ఇలా చాలా బ్యూటీఫుల్ ఎమోషన్ ఈ సినిమాలో ఉంది.

చందు గారు.. చైతు, సాయి పల్లవి ఈ ఇద్దరిలో ఎవరి పెర్ఫార్మెన్స్ బావుటుంది?

-ఈ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత ఎవరు బాగా చేశారనే డిబేట్స్ ఉంటాయి. నన్ను అడిగే రాజు పాత్ర అని చెబుతా.

Whats_app_banner

సంబంధిత కథనం