ప్రియాంక జైన్...తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. హీరోయిన్‌గా సినిమాలు చేసినా...ఎక్కువగా సీరియల్స్, బిగ్‌బాస్‌తోనే పాపులర్ అయ్యింది. తాజాగా ప్రియాంక జైన్ తన పెళ్లి గురించి గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నది. తెలుగు సీరియల్ యాక్టర్ శివకుమార్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉంది ప్రియాంక జైన్. ప్రస్తుతం వీరిద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తొందరలోనే ప్రియాంక జైన్, శివ కుమార్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
జబర్ధస్థ్ వర్ష హోస్ట్‌గా కిస్సిక్ టాక్స్ పేరుతో ఓ తెలుగు ఛానెల్‌లో టాక్ షో టెలికాస్ట్ అవుతోంది. ఈ టాక్ షో నెక్స్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ప్రియాంక జైన్ అటెండ్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో శివకుమార్‌తో పెళ్లి గురించి ప్రియాంక జైన్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఏడాదే తాము పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించింది. మా పెళ్లి మాత్రం మామూలుగా ఉండదని....తగ్గేదేలే అని అన్నది.
ఒక పర్సన్ మన లైఫ్ పార్ట్‌నర్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని ప్రియాంక జైన్‌ను వర్ష అడిగింది. శివ లాంటి క్వాలిటీస్ ఉండాలని ప్రియాంక జైన్ బదులిచ్చింది. ఆమె ఆన్సర్‌కు అందరికి శివ దొరకడు కదా అని వర్ష చెప్పడం ప్రోమోలో ఆకట్టుకుంటోంది.
షోలో శివకుమార్‌కు కాల్ చేసి అతడికి ఐ లవ్ యూ చెప్పింది. శివతో తన పరిచయం, ప్రేమ ఎలా మొదలైందో ఈ షోలో ప్రియాంక రివీల్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. బిగ్‌బాస్ జర్నీ గురించి చెప్పింది. తమకు ఎలాంటి ఆస్తులు లేవని, చాలా కష్టాలు పడుతున్నట్లు ఈ ప్రోమోలో ప్రియాంక కామెంట్స్ చేసింది.
డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2లో ఓ ఎపిసోడ్‌లో ప్రియాంక జైన్ ధరించిన డ్రెస్‌పై నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ తనను బాధపెట్టాయని, కామెంట్స్ చూసి అసహ్యం వేసిందని అన్నది. అలాంటి డ్రెస్‌లు షోలలో మాత్రమే వేసుకుంటామని, మాల్స్‌లలో వేసుకొని తిరగమని అన్నది. తాము మనుషులమేనని, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు కన్నీళ్లు వస్తుంటాయని చెప్పింది.
తెలుగులో మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ తో ఫేమస్ అయ్యింది ప్రియాంక జైన్. మౌనరాగంలో నటిస్తున్నప్పుడే శివకుమార్‌తో ప్రియాంక జైన్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఫైనల్ చేరుకుంది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. ఛల్తే ఛల్తే, గోలిసోడా, వినర సోదర వీర కుమారా తో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
సంబంధిత కథనం