Priyanka Chopra Chilkur: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా.. కొత్త అధ్యాయం మొదలైందంటూ పోస్ట్..
Priyanka Chopra Chilkur: ప్రియాంకా చోప్రా చిలుకూరు బాలాజీని దర్శించుకుంది. మంగళవారం (జనవరి 21) ఆమె ఆలయంలో ఉన్న ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకోవడం విశేషం.
Priyanka Chopra Chilkur: గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా ఈ మధ్యే హైదరాబాద్ వచ్చిన విషయం తెలుసు కదా. మహేష్ బాబు, రాజమౌళి మూవీలో ఛాన్స్ కొట్టేసిందన్న వార్తల నేపథ్యంలో ఆమె ఇక్కడికి రావడం విశేషం. అయితే మంగళవారం (జనవరి 21) ఆమె నగరం సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకొని రామ్ చరణ్ భార్య ఉపాసనకు థ్యాంక్స్ చెబుతూ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.

చిలుకూరులో ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన బ్యూటీ ప్రియాంకా చోప్రా. ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో సందడి చేస్తోంది. ఈ మధ్యే భాగ్యనగరానికి వచ్చిన ప్రియాంకా.. ఇక్కడి ఫేమస్ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకుంది. ఆలయ ఆవరణలో తాను ఉన్న ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. “శ్రీ బాలాజీ ఆశీస్సులతో కొత్త అధ్యాయం మొదలైంది.
మనమందరం మన హృదయాల్లో శాంతిని నింపుకొని, మన చుట్టూ సమృద్ధి, సౌభాగ్యాలతో గడపాలి. దేవుడి దయ అనంతం. ఓం నమో నారాయణాయ. థ్యాంక్యూ ఉపాసన కొణిదెల” అనే క్యాప్షన్ తో ఆలయంలోని ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. ఇవి వెంటనే వైరల్ గా మారాయి. కొత్త అధ్యాయం మొదలైందంటూ ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
అది ఎస్ఎస్ఎంబీ29 మూవీ గురించేనా అన్న సందేహాలు ఉన్నా.. ఆమె మహేష్ బాబు, రాజమౌళి పేర్లను కాకుండా ఉపాసన కొణిదల గురించి ప్రస్తావించడం విశేషం. దీంతో జంజీర్ మూవీ తర్వాత మరోసారి ఆమె రామ్ చరణ్ తో కలిసి నటించబోతుందా అన్న అనుమానం కలుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
బాలీవుడ్ లో ఓ స్థాయికి చేరుకున్న తర్వాత ప్రియాంకా చోప్రా హాలీవుడ్ వెళ్లింది. తర్వాత అక్కడి సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు మేరీ అనే కూతురు కూడా ఉంది. మెల్లగా హాలీవుడ్ లో అవకాశాలను పెంచుకున్న ఆమె.. బాలీవుడ్ వైపు తిరిగి రాలేదు. అయితే ఇప్పుడు రాజమౌళి తీయబోతున్న గ్లోబల్ మూవీలో ఛాన్స్ కొట్టేసిందని, ఈ సినిమా ద్వారానే మళ్లీ ఆమె ఇండియన్ మూవీలో అడుగుపెడుతోందని వార్తలు వస్తున్నాయి.