Oscars 2025: ఆస్కార్ అవార్డుల్లో ఈ సారి ఇండియా నుంచి ఫీచర్ ఫిల్మ్ కేటగిరీల్లో ఒక్క సినిమా తుది నామినేషన్స్‌లో నిలవలేదు. కానీ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మించిన అనూజ ఆస్కార్ ఎంట్రీని దక్కించుకొని ఆశలు రేకెత్తించింది. ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌ను గెలుచుకుంటుందని సినీ వర్గాలతో పాటు మేకర్స్ భావించారు. కానీ వారికి నిరాశే మిగిలింది.
లైవ్ యాక్షన్ కేటగిరీలో డచ్ లాంగ్వేజ్‌కు చెందిన ఐయామ్ నాట్ ఏ రోబో ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకున్నది.
అనూజ షార్ట్ ఫిల్మ్‌కు ఆడమ్ గ్రేవ్స్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక చోప్రా, గునీత్ మోంగా, సుచిత్రతో పాటు పలువురు ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రొడ్యూస్ చేశారు. సజ్దా పఠాన్, అనన్యా షాన్‌బాగ్, నగేష్ బోన్ల్సే ఈ షార్ట్ ఫిల్మ్‌లో కీలక పాత్రలు పోషించారు.
అనూజ షార్ట్‌ఫిల్మ్ రన్‌టైమ్ 29 నిమిషాలే కావడం గమనార్హం. ఈ షార్ట్ ఫిల్మ్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అనూజ, పాఠక్ అక్కాచెల్లెళ్లు. పేదరికం కారణంగా ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. అనూజకు చదువు అంటే ఇష్టం. బోర్డింగ్ స్కూల్ ఎగ్జామ్స్ రాసే అవకాశం అనూజకు వస్తుంది. ఆ ఎగ్జామ్స్ అనూజ రాసిందా? కుటుంబ పరిస్థితులు ఆమెకు ఎలా అడ్డుగా నిలిచాయి? చదువు, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయిన అనూజ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అన్నదే ఈ షార్ట్ ఫిల్మ్ కథ. ఈ లైవ్ యాక్షన్ షార్ట్ కేటగిరీలో ఐ యామ్ నాట్ రోబో, అనూజతో పాటు ది లాస్ట్ రేంజర్, ఏ లియాన్, ది మ్యాన్ హూ కుడ్ నాట్ రిమైన్ సెలైంట్‌తో సినిమాలు నామినేట్ అయ్యాయి.
అనూజకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన గునీత్ మోంగా గతంలో రెండు ఆస్కార్ అవార్డులను గెలచుకున్నది. గునీత్ మోంగా రూపొందించిన డాక్యుమెంటరీ మూవీస్ ది ఎలిఫెంట్ విష్పర్స్, పీరియడ్ ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్ సినిమాలు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాయి.
ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఈ ఏడాది ఆమిర్‌ఖాన్ ప్రొడ్యూస్ చేసిన లపాటా లేడీస్ నిలిచింది. కానీ తుది నామినేషన్స్‌లో ఈ మూవీ చోటు దక్కించుకోలేకపోయింది.
సంబంధిత కథనం