Priyanka on Ex-Boyfriends: నా మాజీ ప్రియులంతా గొప్పవాళ్లు, అద్భుతమైన వ్యక్తులు.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్
Priyanka on Ex-Boyfriends: ప్రియాంక చోప్రా తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆసక్తికర కామెంట్లను చేసింది. తన మాజీ ప్రియులంతా గొప్ప వాళ్లని ప్రశంసల వర్షం కురిపించింది. అయితే తన రిలేషన్‌షిప్స్ మాత్రం ఘోరంగా ముగిశాయని చెప్పుకొచ్చింది.
Priyanka on Ex-Boyfriends: ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా దూసుకెళ్తోంది. పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ కెరీర్ పరంగా అత్యత్తమ దశలో ఉంది. అడపా దడపా బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ ఇండియన్ ఆడియెన్స్‌ను కూడా అలరిస్తోంది. ప్రముఖ పాప్ సింగ్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవలే సిటెడల్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ షో ప్రమోషన్లలో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాజీ ప్రియులంతా మంచివారని, ఎంతో గొప్పవారని స్పష్టం చేసింది.
ట్రెండింగ్ వార్తలు
నిక్ కంటే ముందు ప్రియాంక బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, హర్మన్ బవేజా, షారుఖ్ ఖాన్ లాంటి వారితో రిలేషన్‌షిప్‌లో ఉందని పలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా షాహిద్‌తో ఆమె ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారితో బ్రేకప్ చెప్పిన ప్రియాంక నిక్‌తో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన మాజీ ప్రియుల గురించి ఆసక్తికర విషయాలను తెలియజేసింది.
"నేను ఓ రిలేషన్ నుంచి మరో రిలేషన్‌లోకి మారుతూ వచ్చాను. నా చివరి రిలేషన్‌షిప్ వరకు కూడా ఈ బంధాల్లో నాకు నేను సమయం ఇచ్చుకోలేదు. నేను సహచర నటులతో డేటింగ్ చేశాను. సంబంధం ఎలా ఉండాలి అనే దాని గురించి నాకు ఓ ఐడియా ఉందనుకున్నాను. అదే కోరుకున్నాను. నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులు నా ఆలోచనలకు సరిపోయేలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను గొప్ప వ్యక్తులతో డేటింగ్ చేశాను." అని ప్రియాంక చోప్రా తెలిపింది.
"అయితే నా రిలేషన్‌షిప్స్ చాలా ఘోరంగా ముగిసి ఉండవచ్చు. కానీ నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులతో నా డేటింగ్ అద్భుతంగా ఉంది. నా భర్త కంటే ముందు దాదాపు రెండేళ్ల వరకు విరామం తీసుకున్నాను. అప్పుడు ఎలాంటి రిలేషన్‌లో లేను. అందుకు ఓ పెద్ద కారణం ఉంది." అని ప్రియాంక స్పష్టం చేసింది.
నిక్‌తో ప్రియాంక ప్రేమ ఎలా ప్రారంభమైందంటే..
ప్రారంభంలో నిక్‌తో లవ్ లైఫ్ ఎలా ఉందో కూడా ప్రియాంక తెలియజేసింది. క్వింటికో వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో ప్రియాంక సహ నటుడు అప్పటి తన బాయ్ ఫ్రెండ్‌ను అసహ్యించుకునేవారట. ఎందుకంటే క్వంటికో షూటింగ్ సమయంలో అతడి వల్ల ఆమె ఎక్కువగా ఎడుస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉండేదట. దీంతో నిక్‌కు ఓ ఛాన్స్ ఇవ్వాలని వారు ప్రియాంకను ప్రోత్సహించేవారంటూ ఆమె తెలిపింది. అంతేకాకుండా నిక్ సోదరుడు కెవిన్ కూడా ప్రియాంక... తన బ్రదర్‌ను కలవాలని కోరుకున్నారట. అలా ఓ రాత్రి నిక్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి అతడి గురించి తెలుసుకుని ప్రియాంక్ డేటింగ్‌కు పచ్చజెండా ఊపిందట.
నిక్ జోనాస్‌ను ప్రియాంక 2018లో వివాహం చేసుకుంది. కొంతకాలం పాటు డేటింగ్ చేసిన వీరు చివరకు తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. గతేడాది మాలతీ మేరీ అనే ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చారు. సరోగసి ద్వారా వీరు ఈ బిడ్డను పొందారు.