Priyanka Chopra: 8 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా రీ ఎంట్రీ- రాజమౌళి మహేశ్ బాబుతో- యాక్షన్ సీన్స్‌కు ప్రిపరేషన్ మొదలు!-priyanka chopra re entry into indian cinema with ss rajamouli mahesh babu ssmb29 movie after 8 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyanka Chopra: 8 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా రీ ఎంట్రీ- రాజమౌళి మహేశ్ బాబుతో- యాక్షన్ సీన్స్‌కు ప్రిపరేషన్ మొదలు!

Priyanka Chopra: 8 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా రీ ఎంట్రీ- రాజమౌళి మహేశ్ బాబుతో- యాక్షన్ సీన్స్‌కు ప్రిపరేషన్ మొదలు!

Sanjiv Kumar HT Telugu
Dec 29, 2024 12:39 PM IST

Priyanka Chopra Re Entry With Mahesh Babu Rajamouli: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 8 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అది కూడా ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూవీ ఎస్ఎస్ఎమ్‌బీ 29తో అని టాక్. ఇందులోని యాక్షన్ సీన్స్ కోసం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసిందట.

8 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా రీ ఎంట్రీ- రాజమౌళి మహేశ్ బాబుతో- యాక్షన్ సీన్స్‌కు ప్రిపరేషన్ మొదలు!
8 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా రీ ఎంట్రీ- రాజమౌళి మహేశ్ బాబుతో- యాక్షన్ సీన్స్‌కు ప్రిపరేషన్ మొదలు!

Priyanka Chopra Re Entry After 8 Years In Indian Movies: బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కు వెళ్లా ఫుల్ బిజీ అయిపోయింది. సిటాడెల్, ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్ వంటి పాపులర్ ఓటీటీ వెబ్ సిరీస్‌, సినిమాలతో క్రేజీ తెచ్చుకుంది. ఇక హాలీవుడ్‌కు వెళ్లాక ఇండియన్ సినిమాల్లో ప్రియాంక చోప్రా నటించి 8 ఏళ్లు అవుతోంది.

yearly horoscope entry point

ప్రియాంక చోప్రా ఎంట్రీ

అయితే, బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించే జీ లే జరా సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ మూవీతోనే భారతీయ సినిమాల్లో ప్రియాంక చోప్రా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ, జీ లే జరా సినిమాలో ప్రియాంక చోప్రా నటించడంపై క్లారిటీ లేదు. దాంతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చే సినిమా ఏంటనేది ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలో దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కే ఎస్ఎస్ఎమ్‌బీ 29 సినిమాలో ప్రియాంక చోప్రా ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వచ్చాయి. దాంతో ఇండియన్ సినిమాల్లోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇచ్చే మూవీ ఇదేనని బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

6 నెలలుగా సంప్రదింపులు

"రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేశారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కథ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 2025లో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న హీరోయిన్ కోసం వెతకగా అందుకు ప్రియాంక కరెక్ట్ అని రాజమౌలి భావించారు. గత 6 నెలలుగా చిత్ర నిర్మాత ప్రియాంక చోప్రాను సంప్రదింపులు జరుపుతున్నారు" అని పింక్ విల్లా సైట్ పేర్కొంది.

అంతేకాకుండా.. "ఎస్ఎస్ రాజమౌళి లాంటి దర్శకుడితో కలిసి పనిచేయడానికి.. మహేశ్ బాబు వంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే, మహేశ్ బాబుతో మంచి యాక్షన్‌ స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఇప్పటికే ప్రియాంక తన ప్రిపరేషన్ మొదలుపెట్టింది" అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో రాజమౌళి సినిమాలో ప్రియాంక దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు టాక్.

గ్లోబల్ స్టూడియోతో

ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఎనిమిదేళ్ల తర్వాత ప్రియాంక మళ్లీ ఇండియన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఆమె చివరిసారిగా ది స్కై ఈజ్ పింక్ (2019) చిత్రంలో కనిపించింది. ఇక రాజమౌళి ఎస్ఎస్ఎమ్‌బీ 29 సినిమా 2026 చివరి వరకు షూట్ చేసి 2027లో థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అంటే, ప్రియాంక చోప్రా 2027లో తన ఇండియన్ సినిమా రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.

కాగా, ఈ సినిమా కోసం ఓ గ్లోబల్ స్టూడియోతో కలిసి పనిచేయాలని రాజమౌళి గత ఏడాది కాలంగా డిస్నీ, సోనీ సంస్థలతో సంప్రదింపులు జరిపారు. మహేశ్ బాబు సినిమా షూటింగ్ ఇండియా, యూఎస్, ఆఫ్రికా దేశాల్లో జరగనుంది.

ప్రియాంక చోప్రా అప్‌కమింగ్ సినిమాలు

ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా రుస్సో బ్రదర్స్ రూపొందించిన సిటాడెల్ రెండవ సీజన్‌లో నటిస్తోంది. అంతేకాకుండా జాన్ సీనా, ఇడ్రిస్ ఎల్బాతో కలిసి యాక్షన్ థ్రిల్లర్ 'హెడ్స్ ఆఫ్ స్టేట్' మూవీలో నటించనుంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది బ్లఫ్‌లో కూడా ప్రియాంక చోప్రా కనిపించనుంది.

Whats_app_banner