OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ నామినేటెడ్ ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్.. ప్రియాంక చోప్రా నిర్మాతగా..
Anuja OTT Streaming: అనూజ షార్ట్ ఫిల్మ్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ మూవీ నిర్మాతల్లో ప్రియాంక చోప్రా కూడా ఒకరిగా ఉన్నారు.
అనూజ షార్ట్ ఫిల్మ్‌కు వివిధ ఇంటర్నేషనల్ సినీ ఫెస్టివళ్లలో ప్రశంసలు దక్కాయి. హోలీషార్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా మరిన్ని వేదికల్లో ఈ మూవీ ప్రదర్శితమైంది. ఇద్దరు బాలికలతో ఎమోషనల్‍గా సాగే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఆస్కార్ 2025 అవార్డులకు నామినేట్ అయ్యాక అనూజ చాలా పాపులర్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ అనూజ షార్ట్ ఫిల్మ్ ఇండియాలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

రెండు భాషల్లో స్ట్రీమింగ్
అనూజ చిత్రం నేడు (ఫిబ్రవరి 5) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. హిందీ, ఇంగ్లిష్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. అమెరికన్ హిందీ షార్ట్ మూవీగా ఈ చిత్రం రూపొందింది.
అనూజ చిత్రంలో సజ్దా పఠాన్, అనన్య షాన్‍భాగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆజం జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. బాల కార్మిక వ్యవస్థ గురించి ఈ మూవీలో ప్రధానంగా ఉంటుంది. ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. నగేశ్ భోంస్లే, గుల్షన్ వాలియా, సునీత భదౌరియా, రుడోల్ఫో రాజీవ్, జుగల్ కిశోల్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు.
అనూజ లఘు చిత్రాన్ని పాపులర్ నటి ప్రియాంక చోప్రా, గునీత్ మోంగా, మిండీ కలింగ్, సుచిత్ర మిటైతో పాటు మరో ఆరుగురు కలిసి నిర్మించారు. ఫ్రాబ్జియో మాన్సినెలి సంగీతం అందించారు.
ఆస్కార్ నామినేషన్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ 2025 అవార్డులకు అనూజ నామినేట్ అయింది. హృదయాలను తాకేలా ఉండే ఈ షార్ట్ మూవీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచింది. హాలీషార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ షార్ట్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్, మోంట్‍క్లయిర్ ఫిల్మ్ ఫెస్టివళ్లలో ఈ మూవీ ప్రదర్శితమైంది. ఇక నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ షార్ట్ ఫిల్మ్ చూసేయవచ్చు.
అనూజ స్టోరీలైన్
9 ఏళ్ల వయసు ఉన్న అనూజ అనే అమ్మాయి, ఆమె అక్క పాలక్ ఢిల్లీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ పని చేస్తుంటారు. చిన్న వయసులోనే కఠినమైన పని చేస్తూ సవాళ్లను ఎదుర్కొంటుంటారు. ఓ ప్రతిష్టాత్మక బోర్డింగ్ పాఠశాలలో చదివే అవకాశాన్ని అనూజకు ఓ కేరింగ్ ఎడ్యుకేటర్ ఇస్తారు. ఈ తరుణంలో అనూజ ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇది పాలక్ భవిష్యత్తును కూడా ప్రభావితం చేేసేలా ఉంటుంది. అనూజ ఏ నిర్ణయం తీసుకుంది.. ఆమె పాఠశాలకు వెళ్లారా.. కష్టాల నుంచి ఆ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు బయటపడ్డారా అనేది అనూజ చిత్రంలో ఉంటుంది.
సంబంధిత కథనం