Priyanka Chopra on Nick: నేను మిస్ వరల్డ్ అయినప్పుడు మా ఆయన వయసు 7 ఏళ్లు: ప్రియాంక-priyanka chopra on nick says when she became miss world he was 7 years old ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyanka Chopra On Nick: నేను మిస్ వరల్డ్ అయినప్పుడు మా ఆయన వయసు 7 ఏళ్లు: ప్రియాంక

Priyanka Chopra on Nick: నేను మిస్ వరల్డ్ అయినప్పుడు మా ఆయన వయసు 7 ఏళ్లు: ప్రియాంక

Hari Prasad S HT Telugu

Priyanka Chopra on Nick: నేను మిస్ వరల్డ్ అయినప్పుడు మా ఆయన వయసు 7 ఏళ్లు అని చెప్పింది ప్రియాంకా చోప్రా. ఈ మధ్య ఓ షోలో పాల్గొన్న ఆమె.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పడం అభిమానులను షాక్ కు గురి చేస్తోంది.

భర్త నిక్ జొనాస్ తో ప్రియాంకా చోప్రా (AP)

Priyanka Chopra on Nick: ప్రియాంకా చోప్రా కంటే ఆమె భర్త నిక్ జొనాస్ పదేళ్లు చిన్నవాడు అన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే ఆమె మిస్ వరల్డ్ అయినప్పుడు అతని వయసు కేవలం ఏడేళ్లని, ఆమెకు కిరీటం పెట్టడం అతడు టీవీలో చూశాడన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ప్రియాంక తాజాగా ది జెన్నిఫర్ హడ్సన్ షోలో వెల్లడించింది.

నిజానికి ఈ విషయాన్ని ఆమెకు తన అత్త చెప్పిందట. 2000వ ఏడాదిలో ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. అప్పుడు టెక్సాస్ లోని ఉన్న ఏడేళ్ల నిక్ జొనాస్ టీవీలో అది చూశాడట. కానీ అదే నిక్.. 18 ఏళ్ల తర్వాత అదే మిస్ వరల్డ్ ప్రియాంకను పెళ్లి చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. ఎక్కడి మిస్ వరల్డ్.. ఎక్కడి నిక్.. ఎక్కడి ఇండియా, ఎక్కడి అమెరికా.. అయినా ఖండాలు దాటిన వీళ్ల ప్రేమ పెళ్లికి దారితీసి.. ఇద్దరూ ఒక్కటిగా జీవిస్తున్నారు.

2018లో నిక్, ప్రియాంక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. "మా అత్త నాకు అప్పుడు జరిగింది చెప్పిన తర్వాత నేను షాక్ తిన్నాను. నేను 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మిస్ వరల్డ్ గెలిచాను. అది లండన్ లో జరిగింది. అదే ఏడాది జులైలో 18 ఏళ్లు నిండగా.. నవంబర్ లో నాకు కిరీటం దక్కింది. ఆ వయసులో నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. ఈ ప్రపంచమేంటో తెలియదు. మా అత్త కూడా నేను మిస్ వరల్డ్ అయినప్పుడు చూసిందట. ఆ సమయంలో ఆమె లండన్ లోనే ఉన్నదట" అని ప్రియాంకా చోప్రా చెప్పుకొచ్చింది.

"ఏడేళ్ల వయసులో నిక్ ఏదో బ్రాడ్‌వే షోలో ఉన్నాడు. అప్పుడు టీవీలో నేను మిస్ వరల్డ్ కావడం చూశాడట. మా మామ కెవిన్ సీనియర్ కు ఇలాంటి షోలు చూడటం ఇష్టమట" అని ప్రియాంక చెప్పింది. 2017లో తొలిసారి కలిసిన నిక్, ప్రియాంక.. 2018 డిసెంబర్ లో పెళ్లితో ఒక్కటయ్యారు.

సంబంధిత కథనం