Priyanka Chopra SSMB29: హైదరాబాద్ వచ్చిన అమెరికా కోడలు ప్రియాంక చోప్రా.. మహేశ్, రాజమౌళి సినిమా ప్రకటన? వీడియో వైరల్!
Priyanka Chopra Lands In Hyderabad Is For SSMB29: అమెరికాలోని లాస్ ఎంజెల్స్ నుంచి హైదారాబాద్‌కు వచ్చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఈ అమెరికా కోడలు హైదరాబాద్ రాకకు కారణం సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి సినిమా ఎస్ఎస్ఎంబీ 29 కోసమే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Priyanka Chopra Lands In Hyderabad Is For SSMB29: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కు వెళ్లి గ్లోబల్ స్టార్ అయింది. అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడి అమెరికా కోడలు అనిపించుకుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేతిలో అనేక అంతర్జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఎస్ఎస్ఎంబీ29 మూవీలో
అయితే ప్రియాంక చోప్రా భారతీయ సినిమాల్లోకి తిరిగి రావడం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లోని ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తోంది తెగ వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే.
ప్రియాంక చోప్రా వీడియో వైరల్
తాజాగా గురువారం (జనవరి 16) సాయంత్రం హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది ప్రియాంక చోప్రా. భారత్‌కు తిరిగి వచ్చిన ప్రియాంక చోప్రా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన వీడియో గురువారం సాయంత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఆమె గోధుమ రంగు కార్డ్ సెట్ ధరించి, గోధుమ రంగు టోపీతో ముఖాన్ని దాచుకుంది.
కట్టుదిట్టమైన భద్రతతో
కట్టుదిట్టమైన భద్రతల నడుమ తన సిబ్బందితో కలిసి ఎయిర్ పోర్టులో నడుస్తున్న ప్రియాంక చోప్రాను ఆ వీడియోలో చూడొచ్చు. అయితే, ప్రియాంక చోప్రా హైదరాబాద్‌కు రావడానికి కారణం ఎస్ఎస్ఎంబీ29 సినిమానే అని తెగ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే SSMB29లో ప్రియాంక చోప్రా నటిస్తోందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది.
రాజమౌళి సినిమా కోసమే
"తన తదుపరి భారతీయ చిత్రం ప్రకటన కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి" అంటూ బాలీవుడ్ వెబ్ సైట్స్ వెల్లడించాయి. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
చివరిగా నటించింది
ఈ ప్రాజెక్ట్, అందులో ప్రియాంక పాత్రకు సంబంధించిన వివరాలు చాలా రహస్యంగా ఉంచారు. ఇదిలా ఉంటే, 2021 లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన ది వైట్ టైగర్ మూవీ ప్రియాంక చోప్రా చివరి భారతీయ చిత్రం. ఎనిమిదేళ్ల క్రితం 2016లో షోనాలి బోస్ తీసిన 'ది స్కై ఈజ్ పింక్' ఆమె చివరి భారతీయ థియేట్రికల్ రిలీజ్ మూవీ.
ప్రియాంక చోప్రా అప్‌కమింగ్ సినిమాలు
కాగా, ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో అలియా భట్, కత్రినా కైఫ్ నటించే 'జీ లే జరా' సినిమా ప్రియాంక చోప్రా నటించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హెడ్స్ ఆఫ్ ది స్టేట్, ది బ్లఫ్, సిటాడెల్ సీజన్ 2, జోనాస్ బ్రదర్స్‌తో కలిసి హాలీడే వంటి సినిమాల్లో నటిస్తోంది.
సంబంధిత కథనం