Priyanka Chopra Love Again: ఓటీటీలోకి వ‌చ్చేసిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే-priyanka chopra hollywood movie love again streaming now on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyanka Chopra Love Again: ఓటీటీలోకి వ‌చ్చేసిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Priyanka Chopra Love Again: ఓటీటీలోకి వ‌చ్చేసిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

HT Telugu Desk HT Telugu

Priyanka Chopra Love Again: ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించిన హాలీవుడ్ మూవీ ల‌వ్ ఎగైన్ ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?

ప్రియాంక చోప్రా ల‌వ్ ఎగైన్

Priyanka Chopra Love Again: ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించిన హాలీవుడ్ మూవీ ల‌వ్ అగైన్ ఓటీటీలోకి వ‌చ్చేసింది. బుధ‌వారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో ప్రియాంక చోప్రాకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్‌తో పాటు హిందీ ఆడియోతో ఈ సినిమాను రిలీజ్ చేసిన‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది.

రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, సామ్ హ్యూగ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ప్రియాంక చోప్రా భ‌ర్త నిక్ జోన‌స్ గెస్ట్ రోల్‌లో న‌టించాడు. గార్డియ‌న్ ఆఫ్ గెలాక్సీ 3కి పోటీగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ముఖ్యంగా ప్రియాంక, హ్యూగ‌న్ త‌మ రొమాన్స్‌, కెమిస్ట్రీతో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు.

ఇందులో మీరా రే అనే పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టించింది. పెళ్లైనా కొద్ది రోజుల్లోనే మీరా భ‌ర్త చ‌నిపోతాడు. భ‌ర్త చ‌నిపోయిన కొద్ది రోజుల త‌ర్వాత అత‌డి ఫోన్‌కు ఓ రొమాంటిక్ మెసేజ్‌ను పంపుతుంది మీరా. మీరా భ‌ర్త వాడిన ఆ నంబ‌ర్ ను టెలిఫోన్ కంపెనీ రాబ్ అనే వ్య‌క్తికి అసైన్ చేస్తుంది. మీరా పంపించిన మెసేజ్ ను చూసి రాబ్ ఎలా రియాక్ట్ అయ్యాడు?

వారిద్ద‌రు ఎలా ప్రేమ‌లో ప‌డ్డార‌నే పాయింట్‌తో డైరెక్ట‌ర్ జేమ్స్ స్ట్రౌస్ ల‌వ్ ఎగైన్ సినిమాను రూపొందించాడు. జ‌ర్మ‌నీ సినిమాకు రీమేక్‌గా ల‌వ్ ఎగైన్ తెర‌కెక్కింది. అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను ప్రేమించి పెళ్లాడిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ సినిమాల‌కు దూర‌మైంది. హాలీవుడ్ సినిమాల‌పై ఫోక‌స్ పెడుతోంది. వీ కెన్ బీ హీరోస్‌, మ్యాట్రిక్స్ రిజారెక్ష‌న్స్‌తో పాటు మ‌రికొన్ని హాలీవుడ్ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది ప్రియాంక చోప్రా.