ప్రియమణి రెండుపాత్రలు పోషించిన చారులత సినిమా 2021 సెప్టెంబర్ నెలలో విడుదలైంది. కన్నడ, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగు, మలయాళంలోనూ డబ్బింగ్ అయి థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు పొన్ కుమరన్ దర్శకత్వం వహించారు. థాయ్ సినిమా అలోన్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హారర్ ఎలిమెంట్లు, ట్విస్టులతో చారులత మూవీ మెప్పిస్తుంది.
చారులత సినిమాను ఇప్పుడు చూడాలంటే ఉచితంగానే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్‍లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇప్పటి వరకు చూడకపోతే ఓ లుక్ వేయవచ్చు.
చారులత సినిమా తెలుగులో శ్రీబాలాజీ ఫుల్ మూవీస్ అనే యూట్యూబ్ ఛానెల్‍లో అందుబాటులో ఉంది. అక్కడ ఈ సినిమాను ఫ్రీగా చేసేయవచ్చు. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ సినిమాలో శరీరం కలిసి ఉండే చారు, లత అనే అవిభక్త కవలల పాత్రలు పోషించారు ప్రియమణి. స్కంద అశోక్ రో లీడ్ రోల్ చేశారు. శరణ్య పోన్‍వన్నన్, సీత, రవిశంకర్, సుదర్శన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని లవ్ స్టోరీ, హారర్ ఎలిమెంట్లతో తెరకెక్కించారు డైరెక్టర్ పొన్ కుమారన్.
అవిభక్త కవలలు చారు, లత (ప్రియమణి) వైజాగ్‍లో నివసిస్తుంటారు. శరీరాలు అతుక్కొనే ఉన్నా ఆనందంగానే ఉంటారు. ఇంతలో వారి జీవితాల్లోకి రవి (స్కంద) వస్తాడు. చారును అతడు ప్రేమిస్తాడు. అతడి విషయంలో చారు, లత ఇద్దరి మధ్య గొడవలు జరిగి, మనస్పర్థలు వస్తాయి. ఆ తర్వాత ఇద్దరి శరీరాలను విడదీసేందుకు వారి తల్లి (శరణ్య) ఆపరేషన్ చేయిస్తుంది. అయితే, చారు, లత.. ఇద్దరిలో ఒకరు ఆపరేషన్ వల్ల చనిపోతారు. చనిపోయిన ఆ కవలల్లో ఒకరు దెయ్యంలా మారి మరొకరిపై పగ తీర్చుకునేందుకు వస్తారు. ఈ క్రమంలో చాలా మలుపులు ఎదురవుతాయి. ఆపరేషన్ తర్వాత చారు, లతలో చనిపోయింది ఎవరు? నిజం ఎలా బయటపడింది? స్కంద ప్రేమ సక్సెస్ అయిందా? చివరికి ఏమైందనేవి చారులత సినిమా కథలో ప్రధానాంశాలుగా ఉంటాయి.
చారులత సినిమాలో ఊహలకు అందని కొన్ని ట్విస్టులు ఎదురవుతాయి. ఈ చిత్రం గ్రిప్పింగ్‍గా ఇంట్రెస్టింగ్‍గా సాగుంది. ఇప్పటికీ ఎవరైనా చూడకపోతే యూట్యూబ్‍లో ఫ్రీగా వీక్షించొచ్చు. హారర్ చిత్రాలు నచ్చే వారిని ఈ మూవీ మెప్పిస్తుంది. ప్రియమణి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.
సంబంధిత కథనం