Priyamani Bhama Kalapam 2: ఫ‌స్ట్ పార్ట్‌ ఓటీటీలో - సీక్వెల్ థియేట‌ర్‌లో - ప్రియ‌మ‌ణి భామాక‌లాపం 2 అప్‌డేట్ వ‌చ్చేసింది!-priyamani bhamakalapam sequel to arrive in theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Priyamani Bhamakalapam Sequel To Arrive In Theaters

Priyamani Bhama Kalapam 2: ఫ‌స్ట్ పార్ట్‌ ఓటీటీలో - సీక్వెల్ థియేట‌ర్‌లో - ప్రియ‌మ‌ణి భామాక‌లాపం 2 అప్‌డేట్ వ‌చ్చేసింది!

Nelki Naresh Kumar HT Telugu
Nov 23, 2023 01:30 PM IST

Priyamani Bhama Kalapam 2: ప్రియ‌మ‌ణి భామాక‌లాపం 2 మూవీ ఫ‌స్ట్‌లుక్‌ను మేక‌ర్స్ గురువారం రిలీజ్ చేశారు. భామాక‌లాపం మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాగా ఈ సీక్వెల్ మాత్రం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ప్రియ‌మ‌ణి భామాక‌లాపం 2
ప్రియ‌మ‌ణి భామాక‌లాపం 2

Priyamani Bhama Kalapam 2: ప్రియ‌మ‌ణి భామాక‌లాపం మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాగా సీక్వెల్ మాత్రం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. సీక్వెల్ కు సంబంధించి మేక‌ర్స్ గురువారం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. భామా క‌లాపం 2 ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో వాక్యూమ్ క్లీన‌ర్‌ను ప‌ట్టుకొని స్టైలిష్ లుక్‌లో ప్రియ‌మ‌ణి క‌నిపిస్తోంది. ఆమె ప‌క్క‌న ర‌క్తం మ‌ర‌క‌ల‌తో కూడిన ట్రాలీ బ్యాగ్ ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ప్రియ‌మ‌ణి చుట్టూ గ‌న్స్ ఫైర్ అవుతున్న‌ట్లుగా ఉన్నాయి. వాటి వెనుక పెద్ద అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్ ఉండ‌టం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఆక‌ట్టుకుంటోంది. భామా క‌లాపం 2 సినిమాను త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో భామా క‌లాపం సినిమా డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. సీక్వెల్‌ను మాత్రం థియేట‌ర్స్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

భామాక‌లాపం 2 మూవీకి అభిమ‌న్యు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ప‌క్క‌వాళ్ల విష‌యాల ప‌ట్ల ఆస‌క్తిని చూపే అనుప‌మ అనే మ‌ధ్య త‌ర‌గ‌తి గృహిణి ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఎలా చిక్కుకుంది. ఆ నేరం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆమె చేసే ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా భామాక‌లాపం మూవీ తెర‌కెక్కింది. సీక్వెల్ కూడా క్రైమ్ కామెడీ పాయింట్‌తోనే రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.