Nabha Natesh Darling: న‌భాన‌టేష్‌తో హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్ కామెడీ మూవీ - డార్లింగ్ రిలీజ్ డేట్ ఇదే!-priyadarshi nabha natesh romantic comedy movie darling release date locked hanuman producer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nabha Natesh Darling: న‌భాన‌టేష్‌తో హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్ కామెడీ మూవీ - డార్లింగ్ రిలీజ్ డేట్ ఇదే!

Nabha Natesh Darling: న‌భాన‌టేష్‌తో హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్ కామెడీ మూవీ - డార్లింగ్ రిలీజ్ డేట్ ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
Published Jun 24, 2024 12:40 PM IST

Nabha Natesh Darling: ప్రియ‌ద‌ర్శి, న‌భాన‌టేష్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న డార్లింగ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్ నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీ జూలై 19న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

నభానటేష్ డార్లింగ్ మూవీ
నభానటేష్ డార్లింగ్ మూవీ

Nabha Natesh Darling: దాదాపు మూడేన్న‌రేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత న‌భాన‌టేష్ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోన్న డార్లిండ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. హ‌నుమాన్‌తో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందుకున్న కె నిరంజన్ రెడ్డి డార్లింగ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తోన్నాడు. అన‌న్య నాగ‌ళ్ల ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.

జూలై 19న రిలీజ్‌...

డార్లింగ్ మూవీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ఆఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు. జూలై 19న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు.ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీతోనే అశ్విన్ రామ్ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

వై దిస్ కొల‌వెరి...

డార్లింగ్ మూవీకి వై దిస్ కొలవెరి అనే ట్యాగ్‌లైన్ ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటు ఈ క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. పెళ్లి క‌ష్టాల‌తో ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువ‌కుడు భార్య‌కార‌ణంగా ఎలా ఇబ్బందులు ప‌డ్డాడు? ప్రియురాలిగా ఆమెను ఇష్ట‌ప‌డ్డ అత‌డు భార్య‌గా మారిన త‌ర్వాత ఎందుకు ద్వేషించాడు అనే పాయింట్‌ను ద‌ర్శ‌కుడు అశ్విన్‌రామ్ ఈ మూవీలో ఫ‌న్నీగా ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. డార్లింగ్ మూవీకి వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

అల్లుడు అదుర్స్‌తో...

తెలుగులో న‌భాన‌టేష్ చివ‌ర‌గా అల్లుడు అదుర్స్ మూవీతో 2021 జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. దాదాపు మూడున్న‌రేళ్ల గ్యాప్ త‌ర్వాత డార్లింగ్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది.

ఓ యాక్సిడెంట్ కార‌ణంగా ఇన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉంది న‌భాన‌టేష్‌. డార్లింగ్‌తో పాటు ఇటీవ‌లే నిఖిల్ స్వ‌యంభూ మూవీని కూడా అంగీక‌రించింది. ఈ హిస్టారిక‌ల్ మూవీలో వారియ‌ర్ ప్రిన్సెస్ త‌ర‌హా పాత్ర‌లో న‌భాన‌టేష్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

బ‌ల‌గం, ఓ భీమ్ బుష్‌...

మ‌రోవైపు హీరోగా, క‌మెడియ‌న్‌గా బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తోదూసుకుపోతున్నాడు ప్రియ‌ద‌ర్శి. అత‌డు హీరోగా న‌టించిన బ‌లగం మూవీ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కేవ‌లం రెండు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 30 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. క‌మెడియ‌న్‌గా ప్రియ‌ద‌ర్శి కీల‌క‌పాత్ర‌లో హార‌ర్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్ ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో రిలీజైంది. కామెడీ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన ఈ మూవీ 25 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ హార‌ర్ కామెడీ మూవీ చేస్తోన్నాడు ప్రియ‌ద‌ర్శి.

Whats_app_banner