Darling OTT: నభానటేష్ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Darling OTT: నభానటేష్, ప్రియదర్శి జంటగా నటించిన డార్లింగ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఆగస్ట్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Darling OTT: ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటించిన డార్లింగ్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. కాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డార్లింగ్ మూవీ రిలీజ్ కాబోతోంది.
థియేట్రికల్ రిలీజ్‌కు ముందే డార్లింగ్ సినిమా హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) సొంతం చేసుకున్నది. ఆగస్ట్ సెకండ్ లేదా థర్డ్ వీక్‌లో ఈ కామెడీ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతోన్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
కాన్సెప్ట్ బాగుంది కానీ...
డార్లింగ్ మూవీతో అశ్విన్ రామ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకిఎంట్రీ ఇచ్చాడు. హనుమాన్ నిర్మాతలు నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. డార్లింగ్ మూవీపై ఫస్ట్ డేనే దారుణంగా నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. కామెడీ బాగుంది కానీ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడని,సినిమా బోర్ కొట్టిస్తుందంటూ ఆడియెన్స్ ట్వీట్స్, కామెంట్స్ చేశారు.
రిలీజ్‌కు ముందే డార్లింగ్ ద్వారా తాము లాభాల్లోకి అడుగుపెట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా ఎనిమిది నుంచి పది కోట్ల బడ్జెట్‌తో రూపొందినట్లు సమాచారం. థియేట్రికల్, నాన్ థియేట్రికల్, డబ్బింగ్ రైట్స్ ద్వారానే తమకు పదిహేను కోట్ల వరకు వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. తొలిరోజు ఈ మూవీ కోటి లోపే వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
డార్లింగ్ కథేమిటంటే?
రాఘవ (ప్రియదర్శి) కు చిన్ననాటి స్నేహితురాలు నందినితో (అనన్య నాగళ్ల) పెళ్లి కుదురుతుంది. మరికొద్ది నిమిషాల్లో పెళ్లి జరగాల్సిఉండగా రాఘవను కాదని తను ప్రేమించిన అబ్బాయితో నందిని వెళ్లిపోతుంది.పెళ్లి ఆగిపోవడంతో అవమానం తట్టుకోలేక రాఘవ సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. రాఘవ ఆత్మహత్య చేసుకోకుండా ఆనంది (నభానటేష్) ఆపుతుంది.
ఆనంది గతం గురించి ఏం తెలియకుండానే పరిచయమైన కొద్ది గంటల్లోనే పెద్దలు వద్దన్న వినకుండా ఆమెను పెళ్లిచేసుకుంటాడు రాఘవ.ఫస్ట్ నైట్ రోజే ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందనే నిజం రాఘవకు తెలుస్తుంది. ఆనంది ఒక్కరు కాదని, ఆమెలో ఐదుగురు దాగిఉన్నారని బయటపడుతుంది. ఆనందికి ఉన్న సమస్య కారణంగా రాఘవ ఎలాంటి ఇబ్బందులను ఫేస్ పడ్డాడు? ఆనందికి ఆ సమస్య ఎలా వచ్చింది? ప్రియా (నభానటేష్)కు ఆనందికి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ఈ మూవీ కథ.
అనన్య నాగళ్ల ఇంపార్టెంట్ రోల్...
డార్లింగ్ మూవీలో అనన్య నాగళ్ల ఓ కీలక పాత్రలో కనిపించింది. మురళీధర్‌గౌడ్, బ్రహ్మానందం, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత నభా నటేష్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. డార్లింగ్ తర్వాత నిఖిల్ స్వయంభూలో నభానటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.