మలయాళ నటుడు, దర్శకుడు పృథ్విరాజ్ సుకుమార్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నారు. మోహన్‍లాల్ హీరోగా పృథిరాజ్ దర్శకత్వం వహించి ఓ కీలకపాత్ర పోషించిన ఎల్2:ఎంపురాన్ గత నెల విడుదలై బ్లాక్‍బస్టర్ కొట్టింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‍లో రూపొందుతున్న మూవీలో పృథ్విరాజ్ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇంతలోనే బాలీవుడ్‍లో మరో చిత్రానికి ఓకే చెప్పేశారు.
బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ప్రధాన పాత్రలో దార్యా చిత్రం రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మేఘన గుల్జర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించనున్నారంటూ కరీనా నేడు ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో వెల్లడించారు. గుల్జర్, పృథ్వితో మాట్లాడుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు.
డ్రీమ్ టీమ్ అంటూ ఈ విషయాన్ని పోస్ట్ చేశారు కరీనా కపూర్. “నేను డైరెక్టర్స్ యాక్టర్ అని ఎప్పుడూ చెబుతుంటా. మనకు ఉన్న అద్బుతమైన డైరెక్టర్లలో ఒకరైన మేఘన గుల్జార్, నేను ఎంతో ఇష్టపడే పృథ్విరాజ్ సుకుమారన్‍తో కలిసి పనిచేసేందుకు వేచి ఉండలేకున్నా. నా డ్రీమ్ దార్యా. ఇక చేసేద్దాం” అని క్యాప్షన్ రాశారు కరీనా కపూర్.
మహేశ్ - రాజమౌళి కాంబోలో రూపొందుతున్న గ్లోబల్ రేంజ్ సినిమాలో చాలా ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు పృథ్విరాజ్. నెగెటివ్ రోల్ చేస్తున్నారనే రూమర్లు ఉన్నాయి. రాజమౌళి మూవీ చేస్తుండటంతో ఇప్పట్లో ఇతర ఏ ప్రాజెక్టుకు పృథ్వి ఓకే చెప్పరనే అంచనాలు వినిపించాయి. కానీ పృథ్వి మాత్రం కరీనా కపూర్‌తో బాలీవుడ్ మూవీకి సైన్ చేశారు. ఈ దార్య సినిమా షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది.
పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఎల్2: ఎంపురాన్ చిత్రం గత నెల మార్చి 27వ తేదీన విడుదలైంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ చిత్రం రూ.260కోట్ల కలెక్షన్లను దాటేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ మూవీపై వివాదాలు కూడా చాలా వచ్చాయి. మనోభావాలు కించరిచేలా ఉందని కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వృథ్విరాజ్‍పై ఆగ్రహించాయి. దీంతో ఎంపురాన్ సినిమాలో కొన్ని సీన్లను కత్తిరించారు మేకర్స్.
సంబంధిత కథనం