The Goat Life OTT: పృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోట్‌లైఫ్‌ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడే - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?-prithviraj sukumaran malayalam survival thriller movie aadujeevitham the goat life streaming on disneyplus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Goat Life Ott: పృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోట్‌లైఫ్‌ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడే - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

The Goat Life OTT: పృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోట్‌లైఫ్‌ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడే - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 07, 2024 06:36 AM IST

The Goat Life OTT: థియేట‌ర్ల‌లో 100 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన పృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోట్‌లైఫ్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న‌ది.

ది గోట్‌లైఫ్  ఓటీటీ
ది గోట్‌లైఫ్ ఓటీటీ

The Goat Life OTT: పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించిన ఆడు జీవితం( ది గోట్‌లైఫ్‌) మూవీ థియేట‌ర్ల‌లో వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 2024లో మ‌ల‌యాళంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది. స‌ర్వైవ‌ల్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో న‌జీబ్ పాత్ర‌లో పృథ్వీరాజ్ యాక్టింగ్‌, ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ పాత్ర కోసం అత‌డు ప‌డిన క‌ష్టానికి ఆడియెన్స్ ఫిదా అవుతోన్నారు.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో...

థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపిస్తోన్న ఆడుజీవితం మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ది గోట్‌లైఫ్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద‌క్కించుకున్న‌ది. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ సినిమాల‌కు ఉన్న‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 30 కోట్ల‌కు ఆడుజీవితం డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆడుజీవితం మూవీ ఓటీటీలో మే 10న రిలీజ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

న‌ల‌భై రోజుల గ్యాప్‌...

థియేట‌ర్‌, ఓటీటీ మ‌ధ్య మినిమం న‌ల‌భై రోజుల గ్యాప్ ఉండాల‌ని ఇటీవ‌ల కేర‌ళ ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్స్ అసోసియేష‌న్‌, ఫిల్మ్ ఎగ్జిబిట‌ర్స్ యూనియ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి న‌ల‌భై రోజుల త‌ర్వాత ఆడుజీవితం సినిమాను ఓటీటీలో రిలీజ్ ప్రొడ్యూస‌ర్స్ నిశ్చ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. మే ఫ‌స్ట్ వీక్‌లో ఆడుజీవితం ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

ఆడుజీవితం క‌థ ఇదే...

ఉపాధి కోసం న‌జీబ్ అహ్మ‌ద్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌), అత‌డి స్నేహితుడు హ‌కీం (కేఆర్ గోపాల్‌) సౌదీకి వ‌ల‌స‌వెళ‌తారు. అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల ఇద్ద‌రు గొర్రెల కాసే ప‌ని చేయాల్సివ‌స్తుంది. ఏడారిలో నిలువ‌నీడ‌లేక‌, తిన‌డానికి స‌రైన తిండిలేక న‌జీబ్ ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడు? య‌జ‌మానుల వేధింపులను భ‌రించ‌లేక సౌదీ నుంచి త‌ప్పించుకొని పారిపోవాల‌నుకున్న న‌జీబ్ ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? త‌న భార్య‌ను అత‌డు తిరిగి క‌లుసుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌వ‌ల ఆధారంగా....

ది గోట్‌డేస్ అనే న‌వ‌ల ఆధారంగా య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు బ్లెస్లీ ఈ మూవీని తెర‌కెక్కించాడు. 2009లో అత‌డు ఈ మూవీని అనౌన్స్‌చేశాడు. ఎన్నో అడ్డంకుల‌ను దాటుకొని చివ‌ర‌కు ఈ మూవీ 2024లో రిలీజైంది. గోట్‌డేస్‌లో అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించింది. హాలీవుడ్‌ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్‌ గోకుల్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

తెలుగులో కోటిలోపే క‌లెక్ష‌న్స్‌...

ఆడుజీవితం మ‌ల‌యాళంలో బిగ్గెస్ట్‌బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా తెలుగు డ‌బ్ వెర్ష‌న్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ రిలీజ్ చేసిన ఈ మూవీ కోటిలోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ది గోట్‌లైఫ్ తెలుగు వెర్ష‌న్ కోసం హీరో పృథ్వీరాజ్ సుకుమార్ గ‌ట్టిగానే ప్ర‌మోష‌న్స్ చేసినా ప్రేక్ష‌కులు మాత్రం ఈ సినిమాను తిర‌స్క‌రించారు.

ప్ర‌భాస్ స‌లార్‌లో కీల‌క పాత్ర‌లో క‌నిపించిన పృథ్వీరాజ్ సుకుమార‌న్ స‌లార్ 2లో న‌టిస్తోన్నాడు. మ‌ల‌యాళంలో మ‌రో మూడు సినిమాలు చేస్తున్నారు. మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తోన్న లూసిఫ‌ర్ సీక్వెల్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఇందులో ఓ కీల‌క పాత్ర చేయ‌బోతున్నాడు.

IPL_Entry_Point