Prithviraj Sukumaran: దేశంలోనే టాప్ డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చారు.. తెలుగులో దిల్ రాజు: పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్
Prithviraj Sukumaran About L2 Empuraan Distribution And Release: ప్రభాస్ సలార్ మూవీలో విలన్‌గా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మలయాళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఎల్2 ఎంపురాన్. ఇటీవల నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్‌గా కూడా
ది గోట్ లైఫ్ సినిమాతో నటుడిగా తానేంటో నిరూపించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోగా, నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. 2019లో వచ్చిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లూసిఫర్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రెండో పార్ట్‌గా ఎల్2 ఎంపురాన్ సినిమా రానుంది.
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఎల్2 ఎంపురాన్ సినిమాను మార్చి 27న వరల్డ్ వైడ్‌గా మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎల్2 ఎంపురాన్ ట్రైలర్‌ను ఐమాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్.
చాలా నిర్ణయాలు
డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "డైరెక్టర్‌గా ఓ సినిమాను తెరకెక్కించటం అనేది సాధారణమైన విషయం కాదు. చాలా పని ఉంటుంది. చాలా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా L2E: ఎంపురాన్ వంటి సినిమాలను చేయటం మామూలు విషయం కాదు" అని అన్నారు.
"లూసిఫర్ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించాలనుకున్నప్పుడు తొలి భాగం మంచి విజయాన్ని సాధించింది. రెండో భాగానికి సంబంధించిన ఆలోచన మాత్రమే నా మదిలో ఉండేది. దీన్ని కేవలం ఓ మలయాళం సినిమాగా రూపొందించాలనుకోవటం ఛాలెంజింగ్‌గా అనిపించింది. కథకు కావాల్సిన కాన్వాస్, సినిమాకు అవసరమైన స్కేల్ అసాధారణంగా ఉండింది" అని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు.
సగం మాత్రమే ఉన్నాయి
"2022లో మోహన్ లాల్ గారిని ఆయన ఆఫీసులో కలిసి తొలిసారి ఎల్2: ఎంపురాన్‌కు సంబంధించిన నెరేషన్ ఇచ్చాను. ఆ సమయంలో ఇది జరిగే ఛాన్సులు సగం మాత్రమే ఉన్నాయని నా మనసులో అనిపించేది. అయితే మోహన్ లాల్ గారు కథ విని, చాలా బావుంది. ఈ సినిమాను మనం చేస్తున్నాం అన్నారు. ఆ నమ్మకమే నన్ను ఇంత వరకు నడిపించింది" అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు.
"నిర్మాతలు ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ మాకు అండగా నిలిచారు. మా కథను నమ్మి అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. దేశంలోనే టాప్ డిస్ట్రిబ్యూటర్ అయిన అనీల్ తడాని ముందుకు వచ్చారు. దాని వల్లే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు గొప్పగా చూపించే అవకాశం కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుంది" అని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు.
కర్ణాటక-తమిళనాడులో
"ఇక కర్ణాటకలో ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడులో గోకులం గోపాలన్‌కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నాం. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం నాకు అండగా నిలబడింది. అందువల్లనే ఈ సినిమాను అనుకున్న దానికంటే గొప్పగా చిత్రీకరించాం" అని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్