Prithviraj Sukumaran About L2 Empuraan Budget And Remuneration: సలార్ విలన్, మలయాళ హీరో, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన మరో సినిమా ఎల్2 ఎంపురాన్. ఇదివరకు పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా చేసిన ఎల్2 ఎంపురాన్ మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "మా కోసం వచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. తెలుగులో మా సినిమాను రిలీజ్ చేస్తున్న ఆయనకు చాలా థాంక్స్" అని అన్నారు.
"ఇలాంటి సినిమాను మేం ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒరిజినల్ వర్షెన్‌లానే తెలుగు వర్షెన్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డాం. చాలా అథంటిక్‌గా ఉండాలని ప్రయత్నించాం. తెలుగు ప్రేక్షకులు తెలుగు వర్షెన్‌లో చూస్తే.. ఒరిజినల్ సినిమానే అనుకుంటారు. ఎక్కడా డబ్బింగ్ సినిమా అన్నట్టుగా కనిపించదు" అని పృథ్వీరాజ్ తెలిపారు.
"లూసిఫర్ సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయలేదు. కానీ, అన్ని భాషల్లోకి ఆ చిత్రం రీచ్ అయింది. అందుకే ఇప్పుడు ఈ రెండో పార్ట్‌ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే అన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఈ రేంజ్ ట్రెండ్ చూసి మేమంతా సర్‌ప్రైజ్ అవుతున్నాం" అని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు.
"నా దృష్టిలో మంచి సినిమా చెడ్డ సినిమా అనేది మాత్రమే ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. నేను మంచి సినిమాను తీశానని నమ్ముతున్నాను. కాకపోతే ఆ సినిమాను హై బడ్జెట్‌లో తీశాను. ఈ మూవీని చూసిన తరువాత ఏ ఒక్కరూ కూడా ఎంత బడ్జెట్ అయి ఉంటందో అస్సలు అంచనా వేయలేరు. అలా ఎంత అంచనా వేసినా సరే దానికంటే ఎక్కువగానే ఉంటుంది" అని డైరెక్టర్ వెల్లడించారు.
"మోహన్‌లాల్ గారు ఇచ్చిన సపోర్ట్, ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే ఈ మూవీని ఇంత గ్రాండియర్‌గా, ఇంత హై బడ్జెట్‌లో తీయగలిగాం. ఈ క్రెడిట్ అంతా ఆయనదే. ఈ మూవీ కోసం మోహన్ లాల్ గారు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశాం. మార్చి 27న మా చిత్రం రానుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మూడో పార్ట్ చేసేలా సపోర్ట్ చేయండి" అని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కోరారు.
ఇక దిల్ రాజు మాట్లాడుతూ .. "లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మాలీవుడ్‌లో అత్యధిక బడ్జెట్‌తో తీసిన ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో ఉందో టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ట్రైలర్ అలా చూస్తూనే ఉండిపోయా. ఎంతో గ్రాండియర్‌గా అనిపించింది. స్క్రీన్ మీద మోహన్ లాల్ కనిపిస్తే వావ్ అనిపిస్తుంది" అని అన్నారు.
"పృథ్వీరాజ్ సుకుమారన్ గారు పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతోన్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్