Sivakarthikeyan Prince Movie Review: ప్రిన్స్ మూవీ రివ్యూ - టైమ్ పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌-prince movie telugu review sivakarthikeyan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prince Movie Telugu Review Sivakarthikeyan

Sivakarthikeyan Prince Movie Review: ప్రిన్స్ మూవీ రివ్యూ - టైమ్ పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌

HT Telugu Desk HT Telugu
Oct 21, 2022 02:58 PM IST

Sivakarthikeyan Prince Movie Review: శివ‌కార్తికేయ‌న్ హీరోగా కె.వి. అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రిన్స్ సినిమా శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా శివ‌కార్తికేయ‌న్ చేసిన ఈ ద్విభాషా సినిమా ఎలా ఉందంటే...

మారియా, శివ‌కార్తికేయ‌న్‌
మారియా, శివ‌కార్తికేయ‌న్‌

Sivakarthikeyan Prince Movie Review: త‌మిళంలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో శివ‌కార్తికేయ‌న్‌. కామెడీ క‌థ‌ల‌తో అత‌డు చేసిన డాక్ట‌ర్‌, డాన్ సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులో భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. శివ‌కార్తికేయ‌న్ హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన తాజా చిత్రం ప్రిన్స్ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌న్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు జాతిర‌త్నాలు ఫేమ్ కె.వి. అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఉక్రెయిన్ న‌టి మారియా క‌థానాయిక‌గా న‌టించింది. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా? జాతిర‌త్నాలు కామెడీని అనుదీప్ రిపీట్ చేశాడా లేదా అన్న‌ది చూద్దాం.

స్కూల్ టీచ‌ర్ ల‌వ్ స్టోరీ

ఓ స్కూల్‌లో సోషల్‌ టీచర్‌గా ప‌నిచేస్తుంటాడు ఆనంద్‌ (శివ కార్తికేయన్‌). పిల్ల‌ల‌కు క్లాస్‌లు చెప్ప‌కుండా థియేటర్స్‌లో సినిమాలు చూస్తూ యూట్యూబ్‌లో రివ్యూస్‌ చెబుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. ఆనంద్‌ వైఖరి పట్ల సహచర ఉపాధ్యాయులు కోపంతో ఉంటారు. కానీ స్కూల్‌ స్టూడెంట్స్ మాత్రం ఆనంద్‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. ఆనంద్ ప‌నిచేస్తున్న స్కూల్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా జాయిన్‌ అవుతుంది బ్రిటీష్ అమ్మాయి జెస్పికా(మరియా). కొద్ది ప‌రిచ‌యంలోనే జెస్సికాతో ల‌వ్‌లో ప‌డ‌తాడు ఆనంద్‌.

మొదట్లో ఆనంద్‌ను దూరం పెట్టిన జెస్సికా ఫైన‌ల్‌గా గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుంది. కానీ జెస్సికాను ఆనంద్ ప్రేమించ‌డం అత‌డి తండ్రి విశ్వ‌నాథానికి (స‌త్య‌రాజ్‌) ఇష్టం ఉండ‌దు. త‌న తండ్రి చావుకు బ్రిటీష్ వాళ్లే కార‌ణం అని అనుక్ష‌ణం వారిని ద్వేషిస్తుంటాడు విశ్వానాథం. మ‌రోవైపు భారతీయులంటే అంతగా నచ్చని జెస్సికా తండ్రి కూడా వీరి ప్రేమకు ఒప్పుకోడు. జెస్పికా తండ్రికి భారతీయులంటే ద్వేషం ఎందుకు? ఆనంద్ తండ్రి బ్రిటీష్ కోడ‌లిని అంగీక‌రించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి? పెద్ద‌ల‌ను ఒప్పించి ఆనంద్ జెస్సికా ఎలా ఒక్క‌ట‌య్యార‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌.

నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్‌

జాతిర‌త్నాలు సినిమాలో లాజిక్స్ ప‌క్క‌న‌పెట్టి కేవ‌లం మ్యాజిక్ చేసి ప్రేక్ష‌కుల్ని న‌వ్వించాడు ద‌ర్శ‌కుడు అనుదీప్. ప్రిన్స్ సినిమాలో అదే రూట్ ఫాలో అయ్యాడు. ఫ‌న్ ల‌వ్ స్టోరీకి చిన్న సోష‌ల్ మెసేజ్ జోడించి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. బ్రిటీష్ వారిని ద్వేషించాల్సిన ప‌నిలేద‌ని, వారు కూడా ఇండియాలో ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించార‌ని చూపించాడు. బ్రిటీష్ వారిలో మంచి వారు కూడా ఉంటార‌నే పాయింట్‌ను ల‌వ్ స్టోరీతో ఎంట‌ర్‌టైనింగ్‌గా ఈ సినిమాలో చూపించాడు.

ప్ర‌తి సీన్‌లో ఫ‌న్‌(Prince Movie Review)

పిల్ల‌ల‌కు పాఠాలు బ‌దులు సినిమా రివ్యూలు చెప్పే టీచ‌ర్‌గా శివ‌కార్తికేయ‌న్ ప‌రిచ‌య‌మ‌య్యే స‌న్నివేశాల‌తో సినిమా స‌ర‌దాగా సాగుతుంది. ఆనంద్‌, జెస్సికా ప్రేమ‌లో ప‌డే స‌న్నివేశాల‌ను రొమాంటిక్‌తో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి చూపించాడు. వారి ప్రేమ‌కు ఇంట్లో వాళ్ల‌తో పాటు ఊరి పెద్ద‌ల నుంచి ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌తో సెకండాఫ్ సాగుతుంది.

సినిమా ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు ప్ర‌తి సీన్ నుంచి ఫ‌న్ జెన‌రేట్ చేయ‌డానికే ద‌ర్శ‌కుడు క‌ష్ట‌ప‌డ్డాడు. స్కూల్‌ సన్నివేశాలు, కూరగాయల షాపు దగ్గర సీన్ వ‌ర్క‌వుట్ అయ్యాయి. సెకండాఫ్‌లో పోలీస్‌స్టేషన్ సీన్ బాగా పండింది. శివ‌కార్తికేయ‌న్‌, స‌త్య‌రాజ్ ట్రాక్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అనుదీప్ రాసుకున్న పంచ్ డైలాగ్స్‌లో కొన్ని బాగా పేలాయి.

ఎమోష‌న్స్ మిస్‌

కామెడీకి ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌డంతో కొన్ని చోట్ల ఎమోష‌న్స్ మిస్ అయ్యాయి. క్లైమాక్స్‌కు వ‌చ్చే స‌రికి ద‌ర్శ‌కుడు క‌న్ఫ్యూజ్ అయ్యాడు. సినిమాను ఎలా ఎండ్‌ చేయాలో తెలియ‌ని తిక‌మ‌క‌లో ముగించిన‌ట్లుగా అనిపించింది. భిన్న దేశాల‌కు చెందిన ఓ జంట ప్రేమ‌క‌థ‌ను అందంగా చెప్పేందుకు అవ‌కాశం ఉంది. కానీ ద‌ర్శ‌కుడు దానిని స‌రిగ్గా వాడుకోలేదు. ఆనంద్, జెస్సికాల ప్రేమకు పెద్ద‌లు ఒకే చెప్పే స‌న్నివేశాలు ఆక‌ట్టుకోవు.

కామెడీ టైమింగ్ బ‌లం

శివ‌కార్తికేయ‌న్ సినిమా మొత్తం జోవియ‌ల్‌గా క‌నిపించాడు. కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. మారియాను గ్లామ‌ర‌స్‌గా చూపించారు. హీరో తండ్రిగా శివ‌కార్తికేయ‌న్‌, కామెడీ విల‌న్ పాత్ర‌లో ప్రేమ్‌జీ అమ‌ర‌న్ ఆక‌ట్టుకున్నారు.

టైమ్ పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌(Prince Movie Review)

ఓవ‌రాల్‌గా ప్రిన్స్ జ‌స్ట్ యావ‌రేజ్ సినిమా. చ్చు. జాతిర‌త్నాలు త‌ర‌హాలో కామెడీని పండించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. టైమ్ పాస్ అయితే చేస్తోంది.

రేటింగ్ :2.5 / 5

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.