Prime Video Shows: ప్రైమ్ వీడియో ఫ్యాన్స్‌కు పండగే.. ఆ వెబ్ సిరీస్‌ల స్ట్రీమింగ్ డేట్లన్నీ కాసేపట్లోనే వచ్చేస్తున్నాయ్
Prime Video Shows: అమెజాన్ ప్రైమ్ వీడియో మంగళవారం (మార్చి 19) ఓ పెద్ద అనౌన్స్‌మెంట్ చేయబోతోంది. ఇందులో భాగంగా ఆ ఓటీటీలోని హిట్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ల డేట్లన్నీ రానున్నట్లు తెలుస్తోంది.

Prime Video Shows: అమెజాన్ ప్రైమ్ వీడియో.. దేశంలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటి. ఇప్పుడీ ఓటీటీ నుంచీ 2024లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ డేట్లు మంగళవారం (మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ విషయాన్ని కొన్ని రోజులుగా ప్రైమ్ వీడియో స్పెషల్ వీడియోల ద్వారా చెబుతూ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పంచాయత్ 3, సిటడెల్, మీర్జాపూర్ 3 డేట్లు చెబుతారా?
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాదికి అతిపెద్ద అనౌన్స్‌మెంట్ కాసేపట్లో చేయబోతోంది. ఈ అనౌన్స్‌మెంట్ గురించి ఓ స్పెషల్ ప్రోమో ద్వారా వెల్లడించింది. ఈ ప్రోమోలో ప్రైమ్ వీడియోలోని టాప్ వెబ్ సిరీస్ లలో నటించిన నటీనటులందరూ ఉండటంతో అభిమానులు ఆసక్తి మరింత పెరిగింది. ఈ ఏడాది కచ్చితంగా వస్తుందని భావిస్తున్న సిటడెల్ లోని వరుణ్ ధావన్ నుంచి పంచాయత్, మీర్జాపూర్, బండిష్ బాండిట్స్, పాతాళ్ లోక్ లాంటి వెబ్ సిరీస్ లలోని నటీనటులందరూ ఇందులో ఉన్నారు.
ఈ స్పెషల్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. "మేము సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్ధంగా ఉన్నారా.. ఇది కచ్చితంగా భిన్నంగా ఉండబోతోంది.. హంగామా జరగబోతోంది" అంటూ వీళ్లు ఆ వీడియోలో అడగడం విశేషం. అందులోని నటీనటులను బట్టి మంగళవారం (మార్చి 19) ప్రైమ్ వీడియో తమ టాప్ వెబ్ సిరీస్ కొత్త సీజన్లను ఒకేసారి అనౌన్స్ చేయబోతోందన్న అంచనాకు అభిమానులు వచ్చేశారు.
వీటిలో పంచాయత్ సీజన్ 3, మీర్జాపూర్ సీజన్ 3, బండిష్ బాండిట్స్ సీజన్ 2, పాతాళ్ లోక్ సీజన్ 2, కొత్త వెబ్ సిరీస్ సిటడెల్ లాంటి వెబ్ సిరీస్ ఉన్నాయి. వీటి కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా పంచాయత్, మీర్జాపూర్ కొత్త సీజన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అన్న ఆతృత ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. చాలా రోజులుగా ప్రైమ్ వీడియోను వీటి గురించే అడుగుతున్నారు.
ప్రైమ్ వీడియో మెగా ఈవెంట్
దీంతో వీటన్నింటికీ ఈ మెగా ఈవెంట్ ద్వారా ప్రైమ్ వీడియో సమాధానం చెప్పేలా కనిపిస్తోంది. ప్రైమ్ వీడియోలో ఇప్పటి వరకూ వచ్చిన పంచాయత్, మీర్జాపూర్, బండిష్ బాండిట్స్ వెబ్ సిరీస్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో వీటి కొత్త సీజన్లు చాలా ఆసక్తి రేపుతున్నాయి. వీటి అనౌన్స్‌మెంట్ కోసమే ప్రైమ్ వీడియో ఈ మెగా ఈవెంట్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.
మంగళవారం (మార్చి 19) ఉదయం కూడా ప్రైమ్ వీడియో మరో వీడియో ద్వారా ఈవెంట్ కు సిద్ధంగా ఉన్నారా అంటూ అభిమానులను అడిగింది. ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ తోపాటు ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై రిలీజ్ కాబోయే సినిమాల గురించి కూడా ఈ ఈవెంట్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రైమ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఆర్ యు రెడీ వీడియోలతోనే నిండిపోయాయి. దీంతో ఈ ఈవెంట్ పై ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది.
టాపిక్