ప్రైమ్ వీడియోలోని ఈ సూపర్ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దు.. కేవలం గంటన్నర రన్‌టైమ్.. మూవీ అంతా ఒక్క రాత్రిలోనే..-prime video ott thriller stolen movie review in telugu a must watch super thriller movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ప్రైమ్ వీడియోలోని ఈ సూపర్ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దు.. కేవలం గంటన్నర రన్‌టైమ్.. మూవీ అంతా ఒక్క రాత్రిలోనే..

ప్రైమ్ వీడియోలోని ఈ సూపర్ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దు.. కేవలం గంటన్నర రన్‌టైమ్.. మూవీ అంతా ఒక్క రాత్రిలోనే..

Hari Prasad S HT Telugu

ప్రైమ్ వీడియోలో వచ్చిన ఓ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు అదరగొడుతోంది. కేవలం గంటన్నర రన్ టైమ్‌తో వచ్చిన ఈ సినిమా ఒకే రాత్రిలో సాగే స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓ చిన్న పాప కిడ్నాప్ చుట్టూ తిరిగే కథ ఇది.

ప్రైమ్ వీడియోలోని ఈ సూపర్ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దు.. కేవలం గంటన్నర రన్‌టైమ్.. మూవీ అంతా ఒక్క రాత్రిలోనే..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో బుధవారం (జూన్ 4) ఓ హిందీ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ పేరు స్టోలెన్ (Stolen). ఈ సూపర్ థ్రిల్లర్ ఆ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాగా నిలిచింది. ఓ చిన్న పాప కిడ్నాప్, అందులో అనుకోకుండా ఇరుక్కునే ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరిగే ఈ మూవీ ఎలా ఉందో చూడండి.

స్టోలెన్ మూవీ స్టోరీ ఇదీ..

ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న స్టోలెన్ మూవీ కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ మొదట్లోనే ఓ ఆదివాసీ మహిళకు చెందిన ఓ చిన్న పాపను కిడ్నాప్ చేయడం చూడొచ్చు. రాజస్థాన్ లోని ఓ చిన్న ఊళ్లో ఓ రాత్రి రైల్వేస్టేషన్ లో నిద్రిస్తున్న ఆమె పక్కనే ఉన్న చిన్నారిని ఓ మహిళ ఎత్తుకుపోతుంది. ఈ క్రమంలో అప్పుడే రైలు దిగి తన సోదరుడి కోసం ఎదురు చూస్తున్న రమణ్ (శుభం వర్ధన్)ను ఢీకొట్టుకుంటూ వెళ్తుంది.

అతన్ని తీసుకెళ్లడానికి స్టేషన్ కు అతని అన్న గౌతమ్ (అభిషేక్ బెనర్జీ) వస్తాడు. ఆ మహిళకు సాయం చేయాలనుకునే ఈ ఇద్దరూ.. అనుకోకుండా ఆ కిడ్నాప్ కేసులోనే ఇరుక్కుంటారు. వాళ్లు, వాళ్ల కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. పిల్లలను కిడ్నాప్ చేసేవాళ్లుగా వాళ్లపై ముద్ర వేస్తారు. ఓవైపు పోలీసులు, మరోవైపు బయట ఊళ్లో వాళ్ల లక్ష్యంగా మారతారు.

ఈ ప్రమాదం నుంచి ఆ ఇద్దరు అన్నదమ్ములు తప్పించుకుంటారా? అసలు ఆ పాప కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? చివరికి ఆ పాప దొరుకుతుందా లేదా అన్నది ఈ స్టోలెన్ మూవీలో చూడొచ్చు.

స్టోలెన్ ఎందుకు చూడాలంటే?

స్టోలెన్ ఓ థ్రిల్లర్ మూవీ. కేవలం గంటన్నర నిడివితోనే వచ్చింది. మొదటి సీన్ నుంచి చివరి వరకూ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టేలా చేస్తుంది. చాలా వరకు ఒకే రాత్రిలో సాగిపోయే స్టోరీ ఇది. ఈ మూవీని కరణ్ తేజ్‌పాల్ డైరెక్ట్ చేశాడు.

అతనికి ఇదే తొలి సినిమా. అయితే గ్రిప్పింగ్ నెరేషన్ తో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు. సరోగసీ, పిల్లల కిడ్నాపింగ్ అనే ఓ నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకొని స్టోలెన్ మూవీని తీశాడు. ఎక్కడా అనవసర సీన్లు లేకుండా గంటన్నర పాటు మొత్తం సినిమాను చాలా ఆసక్తికరంగా చూసేలా తీర్చిదిద్దాడు. థ్రిల్ అందిస్తూనే మనల్ని ఎమోషనల్ చేసే మూవీ ఇది.

ఇక ఇందులో లీడ్ రోల్ పోషించిన అభిషేక్ బెనర్జీతోపాటు చిన్నారిని కోల్పోయిన తల్లి పాత్ర వేసిన మియా మీల్జర్, శుభం వర్దన్ నటన కూడా హైలైట్. మూవీ మొత్తం ప్రధానంగా ఈ ముగ్గురి చుట్టే తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఉన్న ఈ సినిమా ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం