Prime Video New Movies and Web Series: ప్రైమ్ వీడియోలో కొత్తగా 40 సినిమాలు, వెబ్ సిరీస్.. పూర్తి జాబితా ఇదే-prime video new movies and web series total 40 movies and series announced in a grand event amazon prime video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prime Video New Movies And Web Series Total 40 Movies And Series Announced In A Grand Event Amazon Prime Video Ott

Prime Video New Movies and Web Series: ప్రైమ్ వీడియోలో కొత్తగా 40 సినిమాలు, వెబ్ సిరీస్.. పూర్తి జాబితా ఇదే

Hari Prasad S HT Telugu
Mar 20, 2024 07:58 AM IST

Prime Video New Movies and Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియో అభిమానులకు నిజంగా పండగే. మొత్తంగా 40 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ను ఒకే రోజు అనౌన్స్ చేసింది ఈ ఓటీటీ. అవేంటో చూసేయండి.

ప్రైమ్ వీడియోలో కొత్తగా 40 సినిమాలు, వెబ్ సిరీస్.. పూర్తి జాబితా ఇదే
ప్రైమ్ వీడియోలో కొత్తగా 40 సినిమాలు, వెబ్ సిరీస్.. పూర్తి జాబితా ఇదే

Prime Video New Movies and Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారా? అయితే మరో రెండేళ్ల పాటు మీకు పండగే. తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను మంగళవారం (మార్చి 19) అనౌన్స్ చేసింది. మొత్తం 40 ఒరిజినల్ టైటిల్స్ ను అనౌన్స్ చేయడం విశేషం. అందులో 20 సినిమాలు ఉన్నాయి.

ప్రైమ్ వీడియో ఒరిజినల్స్

ఆర్ యు రెడీ అంటూ కొన్ని రోజుల ముందు నుంచే తమ బిగ్ అనౌన్స్‌మెంట్ గురించి అభిమానులను అలెర్ట్ చేస్తూ వచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో. చెప్పినట్లే వాళ్లను ఏమాత్రం నిరాశ పరచకుండా ఒకే రోజు తమ రాబోయే అన్ని ప్రాజెక్ట్ ల గురించి వెల్లడించింది. కొన్ని మోస్ట్ అవేటెడ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ల గురించి ఎదురు చూసినా.. ఆ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అన్ని రాబోయే వెబ్ సిరీస్, సినిమాల లిస్ట్ ను ఒకే రోజు ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. ఓ గ్రాండ్ ఈవెంట్లో ఆ సిరీస్, మూవీస్ లో నటించిన వాళ్లందరినీ స్టేజ్ పైకి తీసుకొచ్చి ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ ఒరిజినల్స్ లో కొన్ని సిరీస్ లు కొత్త సీజన్లతో రానుండగా.. మరికొన్ని కొత్త సిరీస్ లను కూడా అనౌన్స్ చేశారు.

ఇక తెలుగు, హిందీ, తమిళంలలో రాబోతున్న కొన్ని పెద్ద సినిమాల డిజిటల్ హక్కులను కూడా ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అందులో పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉండటం విశేషం.

ప్రైమ్ వీడియో కొత్త వెబ్ సిరీస్

అంధేరా

సిటడెల్: హనీ బన్నీ (సమంత, వరుణ్ ధావన్ నటించిన సిరీస్)

డేరింగ్ పార్ట్‌నర్స్ (తమన్నా నటిస్తున్న సిరీస్)

మట్కా కింగ్ (విజయ్ వర్మ సిరీస్)

ది రివల్యూషనరీస్

సివరపల్లి

తలైవెట్టియాన్ పాలయమ్

సూపర్ మెన్ ఆఫ్ మాలెగావ్

వుమెన్ ఆఫ్ మై బిలియన్

మా క సమ్

గుల్కాండా టేల్స్

ఇన్ ట్రాన్సిట్ (డాక్యు సిరీస్)

అరేబియా కడలి

ది గ్రేట్ ఇండియన్ కోడ్

రంగీన్

ది రానా కనెక్షన్ (రానా దగ్గుబాటి టాక్ షో)

ఇన్‌స్పెక్టర్ రిషి (నవీన్ చంద్ర హారర్ సిరీస్)

వెబ్ సిరీస్ కొత్త సీజన్లు

మీర్జాపూర్ 3

పంచాయత్ 3

పాతాళ్ లోక్ 2

సుడల్ 2

బండిష్ బ్యాండిట్స్ 2

ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీస్

బి హ్యాపీ

సుబేదార్

చోరీ 2

ఉప్పు కప్పూరంబు

చీకటి లో

ది మెహతా బాయ్స్

యే వతన్ మేరే వతన్

జిద్దీ గర్ల్స్

బ్యాండ్‌వాలే

దిల్ దోస్తీ డైలమా

ఫాలో కర్లో యార్

కాల్ మి బే

డాల్డల్

ఖౌఫ్

గ్యాంగ్స్ కురుత్తి పునల్

స్నేక్స్ అండ్ ల్యాడర్స్

డిజిటల్ హక్కులు పొందిన సినిమాలు

అశ్వథ్థామ- ది సాగా కంటిన్యూస్

భాగీ 4

చందూ ఛాంపియన్

డాన్ 3

కాంతారా

మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్

సింగం అగైన్

బ్యాడ్ న్యూస్

యోధ

ఘాటీ

ఓం భీం బుష్

ఫ్యామిలీ స్టార్

గేమ్ ఛేంజర్

ఉస్తాద్ భగత్ సింగ్

హరి హర వీర మల్లు

ఇక్కీస్

స్త్రీ 2

కంగువ

హౌజ్‌ఫుల్ 5

WhatsApp channel