Prime Video Releases this week: ఈ వారం ప్రైమ్ వీడియోలో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే
Prime Video Releases this week: ప్రైమ్ వీడియోలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి. అందులో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కూడా ఉండటం విశేషం. థియేటర్లలో దారుణంగా బోల్తా కొట్టిన ఈ సినిమాను ఓటీటీలో ఎంతమేర ఆదరిస్తారన్నది చూడాలి.
Prime Video Releases this week: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన కొన్ని మూవీస్ ఉన్నాయి. వాటిలో గేమ్ ఛేంజర్, ది మెహతా బాయ్స్, బ్యాగ్‌మ్యాన్, యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ లాంటివి ఉండటం విశేషం. మరి వీటిలో ఏ మూవీ ఎప్పుడు ప్రైమ్ వీడియోలోకి అడుగు పెట్టనుందో ఒకసారి చూద్దాం.
గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్
ప్రైమ్ వీడియోలో ఈ వారం ఎంతో ఆసక్తి రేపుతున్న మూవీ గేమ్ ఛేంజర్ అనడంలో సందేహం లేదు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియోనే మంగళవారం (ఫిబ్రవరి 4) వెల్లడించింది.
వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో సినిమాకు దారుణమైన కలెక్షన్లు వచ్చినా.. ఓటీటీలో మాత్రం కాస్త మెరుగైన రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను వచ్చే శుక్రవారం నుంచి మిస్ కాకుండా చూడండి.
ది మెహతా బాయ్స్
ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తొలిసారి డైరెక్ట్ చేసిన మూవీ ది మెహతా బాయ్స్ నేరుగా ప్రైమ్ వీడియోలోకే వస్తోంది. ఈ సినిమా కూడా శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచే స్ట్రీమింగ్ కానుంది. నటుడిగా అదరగొట్టే బొమన్ ఇరానీ డైరెక్టర్ గా ఏం మాయ చేశాడో తెలుసుకోవాలంటే ది మెహతా బాయ్స్ చూడాల్సిందే. ఇప్పటికే మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
తండ్రీకొడుకుల మధ్య తరాల అంతరాల వల్ల వచ్చే మనస్పర్ధల ఆధారంగా మూవీ తెరకెక్కినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరి ది మెహతా బాయ్స్ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చూడాల్సినవే
ప్రైమ్ వీడియోలో ఈవారం ఈ రెండు మూవీసే రిలీజ్ కానున్నాయి. అయితే ఇవే కాకుండా ఇప్పటికే ఈ ఓటీటీలోకి వచ్చిన పలు ఇతర సినిమాలు ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే ఈ వీకెండ్ చూసేయండి.
వాటిలో పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ సీజన్ 2, విడుదల పార్ట్ 2 మూవీ, అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంటు టు టాక్ మూవీ, ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీ యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్, చిడియా ఉడ్ అనే కొత్త హిందీ వెబ్ సిరీస్, సివరపల్లి అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలో ఈ మధ్యే వచ్చాయి. వీటికి ఈ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
సంబంధిత కథనం