సిల్క్ స్మిత... 1980, 90 దశకంలో టాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌తో యువతరాన్ని ఉర్రూతలూగించింది. సిల్క్ స్మిత ఐటెంసాంగ్ లేకుండా అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కేవి కావంటే అతిశయోక్తి కాదు. అప్పటి అగ్ర హీరోయిన్లకు ధీటుగా సిల్మ్ స్మిత్ రెమ్యునరేషన్ తీసుకున్నది. శృంగార తారగా పేరు తెచ్చుకున్న సిల్మ్ స్మిత కొన్ని సినిమాల్లో ఢీ గ్లామర్ పాత్రల్లో కనిపించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తనదైన ముద్ర వేసింది.
యాక్టింగ్‌కే పరిమితం కాకుండా సిల్మ్ స్మిత్ ప్రొడ్యూసర్‌గా కూడా తెలుగులో మూడు సినిమాలు చేసింది. గ్లామర్ క్వీన్‌గా ఓ వెలుగు వెలిగిన సిల్మ్ స్మితకు ప్రొడక్షన్ ఏ మాత్రం అచ్చిరాలేదు. ఆమె నిర్మించిన ఈ మూడు సినిమాలు షూటింగ్‌కు పూర్తయిన రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ సినిమాల నిర్మాణం కారణంగా ఆర్థికంగా సిల్మ్ స్మిత తీవ్రంగా నష్టపోయింది.
ఎస్సార్ సినీ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన సిల్క్ స్మిత తొలి ప్రయత్నంగా ప్రేమించుచూడు అనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ హీరోలుగా నటించిన ఈ మూవీలో సిల్మ్ స్మిత హీరోయిన్‌గా నటించింది. తొలుత ఈ సినిమాకు బ్రహ్మ నీ తలరాత తారుమారు అనే టైటిల్ అనుకున్నారు.
కానీ టైటిల్‌పై అభ్యంతరాలు రావడంతో ప్రేమించిచూడుగా మార్చారు. ఈ సినిమా నిర్మాణ పనులు తన సెక్రటరీకి అప్పగించింది. సినిమా ఫెయిలవ్వడం, సెక్రటరీ చేసిన మోసం కారణంగా తన నగలు తాకట్టు పెట్టి మరి సినిమా కోసం చేసిన అప్పులను తీర్చింది సిల్మ్ స్మిత.
ఆ తర్వాత త్రిపురనేని మహారథి డైరెక్షన్‌లో సిల్క్ స్మిత నా పేరు దుర్గ అనే సినిమాను నిర్మించింది. లాంఛింగ్‌తో ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ రిలీజ్ కాలేదు. ఆ తర్వాత తమిళ ఫైట్ మాస్టర్ క్రాస్ బెల్ట్ మణి డైరెక్షన్‌లో వీరవిహారం అనే యాక్షన్ మూవీని మొదలుపెట్టింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
ఈ మూడు సినిమాల్లో కేవలం ప్రేమించిచూడు మాత్రమే థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాల కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది సిల్క్ స్మిత. ఈ నష్టాలకు తోడు వ్యక్తిగత జీవితంలో ఎదురైన నష్టాల కారణంగా 1996లో సిల్మ్ స్మిత ఆత్మహత్య చేసుకుంది.
సంబంధిత కథనం
టాపిక్