Malayalam OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి ప్రేమలు హీరో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో
Malayalam OTT: ప్రేమలు ఫేమ్ నస్లీన్ హీరోగా నటించిన ఐ యామ్ కథలాన్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
Malayalam OTT: ప్రేమలు మూవీతో హీరోగా కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నస్లీన్. ఈ మూవీలో ప్రేమ, జీవితం పట్ల క్లారిటీ లేని యువకుడిగా నేటితరం యూత్ మనస్తత్వాలను ప్రతిబింబించే పాత్రలో నాచరుల్ యాక్టింగ్‌ను కనబరిచాడు.
ఈ మూవీలో నస్లీన్, మమితాబైజు కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను మెప్పించింది. కేవలం మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ప్రేమలు మూవీ 130 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రేమలు మూవీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు.
సైబర్ క్రైమ్ థ్రిల్లర్...
ప్రేమలు తర్వాత హీరో నస్లీన్, డైరెక్టర్ గిరీష్ ఏడి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఐమాయ్ కథలాన్. సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌కు ప్రేమకథను జోడించిన తెరకెక్కించిన ఈ మూవీలో అనీష్మా అనిల్‌కుమార్ హీరోయిన్‌గా నటించింది. నవంబర్ ఫస్ట్ వీక్‌లో మలయాళంలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.
ప్రేమలు క్రేజ్ కారణంగా ఈ చిన్న సినిమాపై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రొటీన్ కాన్సెప్ట్ కారణంగా ఆశించిన స్థాయిలో ఐ యామ్ కథలాన్ వసూళ్లను దక్కించుకోలేకపోయింది. సైబర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లోని ట్విస్ట్‌లు, నస్లీన్ క్యారెక్టర్ మాత్రం ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
నెల రోజుల్లోనే ఓటీటీలోకి...
ఐ యామ్ కథలాన్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ మూవీ మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే రిలీజ్ కానుంది. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
ఐ యామ్ కథలాన్ కథ ఏంటంటే?
విష్ణు (నస్లీన్) ఇంజనీరింగ్ పూర్తిచేస్తాడు. బ్యాక్‌లాగ్స్ చాలా ఉండటంతో జాబ్ దొరకడం కష్టమవుతుంది. కాలేజీ రోజుల నుంచి శిల్పను (అనీష్మా) ప్రేమిస్తాడు. శిల్ప తన తండ్రి ఫైనాన్స్ కంపెనీలోనే జాబ్‌లో జాయిన్ అవుతుంది. విష్ణు హ్యాకింగ్‌లో దిట్ట. శిల్ప ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేసి దొరికిపోతాడు.
గొడవలు పడి ఇద్దరు విడిపోతారు. అదే టైమ్‌లో విష్ణు తండ్రి చిట్‌ఫండ్ కంపెనీలో డబ్బు పెట్టి మోసపోతాడు. మోసగాడిగా ముద్రపడటంతో ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సివస్తుంది. తన హ్యాకింగ్ టాలెంట్ ఉపయోగించి చిట్‌ఫండ్ కంపెనీ నుంచి తండ్రి కోల్పోయిన డబ్బును విష్ణు ఎలా డబ్బు రాబట్టాడు? జాబ్ సంపాదించి శిల్ప ప్రేమను ఎలా పొందాడు అన్నదే ఈ మూవీ కథ.
ప్రేమలు కంటే ముందే...
ప్రేమలు కంటే ముందే 2022లో ఐ యామ్ కథలాన్ మూవీ షూటింగ్ మొదలైంది. ప్రేమలు కారణంగా ఈ మూవీ షూటింగ్‌ను చాలా కాలం పాటు వాయిదావేశారు. ఐ యామ్ కథలాన్ మూవీకి సిద్ధార్థ ప్రదీప్ మ్యూజిక్ అందించాడు.