Premalu Box Office Collections: ఈ మలయాళ మూవీ జోరు మామూలుగా లేదు.. బడ్జెట్ రూ.3 కోట్లు.. కలెక్షన్లు రూ.41 కోట్లు
Premalu Box Office Collections: మలయాళ మూవీ ప్రేమలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ ఇప్పటికే రూ.41 కోట్లు వసూలు చేసింది.
Premalu Box Office Collections: మలయాళ మూవీ సత్తా ఏంటో మరోసారి చాటుతోంది ప్రేమలు అనే మూవీ. నస్లేన్ గఫూర్, మమితా బైజు లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్లు వసూలు చేయడం విశేషం.
ప్రేమలు కలెక్షన్ల సునామీ
ప్రేమలు ఓ మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ. ఫిబ్రవరి 9న వాలెంటైన్స్ వీక్ లో రిలీజైంది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో లాభాలు వస్తున్నాయి. తొలి షో నుంచే అటు ఆడియెన్స్, ఇటు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు రావడంతో సెకండ్ వీకెండ్ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేమలు మూవీ జోరు తగ్గలేదు.
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి పది రోజుల్లోనే రూ.41 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు రూ.50 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రేమలు మూవీ జోరు చూస్తుంటే.. అదేమంత కష్టంగా అనిపించడం లేదు. నిజానికి మలయాళంలో ప్రస్తుతం భ్రమయుగం, మలైకొట్టాయి వాలిబన్ లాంటి పెద్ద సినిమాలు ఉన్నా ఈ చిన్న సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం నిజంగా విశేషమే.
ప్రేమలు మూవీ క్రేజ్
ప్రేమలు మూవీ ఫిబ్రవరి 9న రిలీజైంది. రెండో ఆదివారం (ఫిబ్రవరి 18) అంటే పదో రోజు కూడా ఈ సినిమా కేరళలో రూ.3.52 కోట్లు వసూలు చేసిందంటే ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి గత గురువారం (ఫిబ్రవరి 15) రిలీజైన మమ్ముట్టి భ్రమయుగం కూడా ఇంతే వసూలు చేసింది. ఇక మొత్తంగా ప్రేమలు మూవీ కేరళలో తొలి పది రోజుల్లో రూ.22.37 కోట్లు రాబట్టింది.
ఇక ఇండియా వ్యాప్తంగా రూ.24 కోట్లుగా ఉన్నాయి. ఇక ఓవర్సీస్ నుంచి మరో రూ.17 కోట్లు రావడం అంటే మాటలు కాదు. ఈ జోరు ఇలాగే కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరుతుంది. చివరికి రూ.70 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ రన్ ముగించే అవకాశం ఉంది.
ప్రేమలు ఓటీటీ రిలీజ్
ప్రేమలు మూవీ మార్చిలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మూవీ థియేటర్లలో కేవలం మలయాళంలోనే నడుస్తున్నా.. మిగతా భాషల్లోనూ ఓటీటీలోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రేమలు మూవీలో లీడ్ రోల్స్ తోపాటు సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీమ్, మాథ్యూ థామస్ లాంటి వాళ్లు నటించారు.
చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచి భవిష్యత్తు కోసం యూకే వెళ్లాలని కలలు కనే యువకుడు.. భవిష్యత్తుపై పూర్తి క్లారిటీతో సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన యువతి మధ్య సాగే ప్రేమ కథ ఇది. యువతను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ప్రేమలు మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది.