Prema Entha Madhuram: జీ తెలుగులో ‘ప్రేమ ఎంత మధురం’ అను సీమంతం వేడుక ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?-prema entha madhuram anu seemantham veduka in zee telugu soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prema Entha Madhuram Anu Seemantham Veduka In Zee Telugu Soon

Prema Entha Madhuram: జీ తెలుగులో ‘ప్రేమ ఎంత మధురం’ అను సీమంతం వేడుక ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?

Hari Prasad S HT Telugu
Apr 25, 2023 01:55 PM IST

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రేమ ఎంత మధురం అను సీమంతం వేడుక ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా ఆ ఛానెల్ రిలీజ్ చేసింది.

ప్రేమ ఎంత మధురం అను, ఆర్య
ప్రేమ ఎంత మధురం అను, ఆర్య

Prema Entha Madhuram: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఛానెల్స్ లో ఒకటి జీ తెలుగు. తెలుగులో వస్తున్న టాప్ సీరియల్స్ లో ఈ ఛానెల్ కు చెందినవే సగం ఉంటాయి. అలాంటి ఛానెల్లో మూడేళ్లుగా కొనసాగుతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం. ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సీరియల్ నుంచి ఇప్పుడో వినూత్న ప్రయత్నం చేయబోతోంది జీ తెలుగు ఛానెల్.

ప్రేమ ఎంత మధురంలోని ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ అను సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ సీరియల్లో పేరెంట్స్ గా మారబోతున్న అను, ఆర్య జీవితాలు మారబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అను కోసం జీ తెలుగు ఓ మెగా బేబీ షవర్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు జీ తెలుగు షోలలోని ప్రధాన నటీనటులంతా హాజరై కాబోయే తల్లిదండ్రులను దీవించారు.

ఈ అను సీమంతం వేడుక ఈవెంట్ జీ తెలుగులో వచ్చే ఆదివారం (ఏప్రిల్ 30) సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఈ సీమంతం వేడుకను ఓ పెద్ద ఈవెంట్ గా నిర్వహించడం విశేషం. దీనికి సంబంధించిన ప్రోమోలను కూడా ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. జీ తెలుగు ఛానెల్లోని యాక్టర్స్ అందరూ ఈ వేడుక సందర్భంగా అంత్యాక్షరిలో పార్టిసిపేట్ చేశారు.

ఈ ఈవెంట్ కు జంటలైన సాయి కిరణ్, జయశ్రీ.. ప్రీతి శర్మ, సుజిత్.. రాఖీ, ఐశ్వర్య.. అంజనా, రాజీవ్ లాంటి వాళ్లు వచ్చారు. వీళ్లంతా ఓ సరదాగా సాగిపోయే గేమ్ కూడా ఆడారు. ఇక ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది వరలక్ష్మి శరత్ కుమార్. సామజవరగమన మూవీ నటీనటులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని మ్యూజికల్ చెయిర్స్ ఆడటం విశేషం.

మొత్తానికి అను సీమంతం వేడుక ఆడియెన్స్ ను బాగా ఎంటర్‌టైన్ చేయనుంది. గతంలో ఇలాంటి ప్రయోగం మరే ఇతర ఛానెల్ చేయలేదని జీ తెలుగు చెబుతోంది. ఈ వేడుకను చూసి ఎంజాయ్ చేయాలని కోరుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.