Prashanth Neel on Salaar: సలార్, కేజీఎఫ్ ఒకేలా కనిపించడానికి కారణం ప్రశాంత్ నీల్‌కు ఉన్న ఆ జబ్బేనట!-prashanth neel on why salaar and kgf look similar he has ocd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prashanth Neel On Salaar: సలార్, కేజీఎఫ్ ఒకేలా కనిపించడానికి కారణం ప్రశాంత్ నీల్‌కు ఉన్న ఆ జబ్బేనట!

Prashanth Neel on Salaar: సలార్, కేజీఎఫ్ ఒకేలా కనిపించడానికి కారణం ప్రశాంత్ నీల్‌కు ఉన్న ఆ జబ్బేనట!

Hari Prasad S HT Telugu

Prashanth Neel on Salaar: సలార్ రెండు ట్రైలర్లు చూస్తే అచ్చూ కేజీఎఫ్ చూసిన ఫీలింగే మీకూ కలుగుతోందా? నిజానికి ఈ రెండు సినిమాల డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ కూ అలాగే అనిపిస్తోంది. దీనికి కారణమేంటో కూడా అతడు చెప్పాడు.

ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ (Twitter)

Prashanth Neel on Salaar: సలార్ అయినా, కేజీఎఫ్ అయినా అందరూ గమనించిన ఓ కామన్ విషయం ఉంది. అది వీటిలోని డార్క్ థీమ్. కేజీఎఫ్ రెండు పార్ట్ లు చూసిన వాళ్లు సలార్ ట్రైలర్ చూడగానే అచ్చూ ఆ సినిమాల్లాగే అనిపిస్తోందే అనుకుని ఉంటారు. అయితే దీనికి కారణమేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వివరించాడు.

సలార్ మూవీ రెండు ట్రైలర్లు ఇప్పటి వరకూ వచ్చాయి. అయితే కేజీఎఫ్ లో ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన సామ్రాజ్యం.. ఇప్పటి సలార్ లోని ఖాన్సార్ సామ్రాజ్యం దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి. ఓ డార్క్ థీమ్ లో విజువల్స్ కనిపిస్తాయి. హీరోలు, విలన్లు కూడా అచ్చూ కేజీఎఫ్ లో ఉన్నట్లే ఉన్నారు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఇలాగే ఉంటాయా? అతనికి మరోలా సినిమాలు తీయడం రాదా అన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ దీనిపై స్పందించాడు. "సలార్, కేజీఎఫ్ ఒకేలా కనిపించడానికి కారణం నాకు ఓసీడీ ఉండటమే" అని అతడు చెప్పడం గమనార్హం. ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయాలనిపించడం. ప్రశాంత్ నీల్ కు కూడా ఎక్కువ రంగులు వాడటం నచ్చదట. అందుకే మొత్తం బ్లాక్ థీమ్ లో సినిమాలు తీసేస్తున్నాడు.

"ఎక్కువ రంగులు ఉన్న బట్టలు నేను వేసుకోను. అందువల్ల నా వ్యక్తిత్వమే మీకు స్క్రీన్ పైనా కనిపిస్తుంది. భువన్ గౌడ కూడా అలాంటి గ్రే కలర్ ప్యాలెట్ లోనే షూట్ చేయడానికి ఇష్టపడతాడు. నేను కూడా ఇలాంటి స్టైల్లో సినిమాలు షూట్ చేయడం బాగుంటుందని భావించాను" అని ప్రశాంత్ నీల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ప్రశాంత్ నీల్ గతంలో తీసిన ఉగ్రం, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలన్నీ ఇలాంటి థీమ్ తోనే ఉంటాయి. ఇప్పుడు సలార్ మూవీ కోసం అతడు ఖాన్సార్ అనే ఓ కొత్త సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు. గత సినిమాలలాగే ఈ సలార్ లోనూ వయోలెన్స్ ఎక్కువగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ఖాన్సార్ ఎరుపెక్కాల అంటూ ట్రైలర్ లో ప్రభాస్ డైలాగ్, సెన్సార్ బోర్డు ఇచ్చిన ఎ సర్టిఫికెట్ ఈ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాయి.