Dream Catcher: నేను అడవి శేష్, రానాలా ఉన్నానని కామెంట్స్ వస్తున్నాయి.. హీరో ప్రశాంత్ కృష్ణ కామెంట్స్-prashanth krishna about rana and adivi sesh in dream catcher pre release event director sandeep kakula speech ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dream Catcher: నేను అడవి శేష్, రానాలా ఉన్నానని కామెంట్స్ వస్తున్నాయి.. హీరో ప్రశాంత్ కృష్ణ కామెంట్స్

Dream Catcher: నేను అడవి శేష్, రానాలా ఉన్నానని కామెంట్స్ వస్తున్నాయి.. హీరో ప్రశాంత్ కృష్ణ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 28, 2024 06:11 AM IST

Hero Prashanth Krishna About Rana Adivi Sesh In Dream Catcher: తెలుగులో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తోన్న మూవీ డ్రీమ్ క్యాచర్. ప్రశాంత్ కృష్ణ హీరోగా చేసిన డ్రీమ్ క్యాచర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 27న నిర్వహించారు. తనను రానా, అడవి శేష్‌లా ఉన్నావంటున్నారని ప్రశాంత్ కృష్ణ తెలిపాడు.

నేను అడవి శేష్, రానాలా ఉన్నానని కామెంట్స్ వస్తున్నాయి.. హీరో ప్రశాంత్ కృష్ణ కామెంట్స్
నేను అడవి శేష్, రానాలా ఉన్నానని కామెంట్స్ వస్తున్నాయి.. హీరో ప్రశాంత్ కృష్ణ కామెంట్స్

Prashanth Krishna Dream Catcher Pre Release Event: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు సందీప్ కాకుల తెరకెక్కించారు.

yearly horoscope entry point

డ్రీమ్ క్యాచర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న డ్రీమ్ క్యాచర్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, డైరెక్టర్‌తోపాటు ఇతర టెక్నిషియన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ.. "నాలుగేళ్ల కిందట సందీప్ ‘డ్రీమ్ క్యాచర్’సినిమా ఆడిషన్ కోసం పిలిచాడు. ఇప్పుడు ఈ వేదిక మీద మేమంతా ఉన్నామంటే దానికి కారణం మా సందీప్. టీమ్‌లోని ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్తూ ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను కంప్లీట్ చేశాడు" అని తెలిపాడు.

రానాలా ఉన్నానంటూ

"సైకలాజికల్ థ్రిల్లర్‌గా సరికొత్త ఎక్సిపీరియన్స్ ఈ సినిమా మీ అందరికీ ఇస్తుంది. ట్రైలర్ చూశాక నేను అడివి శేష్, రానాలా ఉన్నానంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్లు గొప్ప యాక్టర్స్. సెల్ఫ్ మేడ్ స్టార్స్. అలాంటి టాలెంటెడ్ ప్యాషనేట్ యాక్టర్స్‌తో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది. ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మిమ్మల్ని డెఫనెట్‌గా ఆకట్టుకుంటుంది" అని హీరో ప్రశాంత్ కృష్ణ చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ.. "సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మొదలైంది. ఇన్‌సెప్షన్ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఇన్సిపిరేషన్‌గా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నాను. మనకున్న రిసోర్సెస్‌లో మొత్తం హైదరాబాద్‌లోనే సినిమా రూపొందించాను" అని తెలిపారు.

తెలుగులో రాలేదని చెప్పగలను

"ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. మేము ఎక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే షూట్ చేశాం. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో సినిమా ఉంటుంది. పాటలు ఫైట్స్ ఉండవు. అవి లేకుండా కేవలం కథ మీదనే మూవీ వెళ్తుంది" అని డైరెక్టర్ సందీప్ కాకుల అన్నారు.

"ఇది థియేటర్, ఓటీటీకి వెళ్తుందా అని అనుకోలేదు. ఒక మంచి మూవీ చేస్తే ఎక్కడైనా ఆదరిస్తారని నమ్మాను. నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్‌లో ప్రమోషన్ చేస్తున్నాం. మాకున్న టైమ్‌లో సినిమాను ఆడియెన్స్‌కు రీచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. జనవరి 3న ‘డ్రీమ్ క్యాచర్’సినిమాను థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయండి" అని డైరెక్టర్ కోరారు.

స్క్రీన్ మీద కనిపిస్తుంది

"డ్రీమ్ క్యాచర్ లాంటి గొప్ప చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ప్రతి ఆర్టిస్ట్ ఎంతో బాగా నటించారు. మా టీమ్ ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. జనవరి 3న థియేటర్స్‌లో మిమ్మల్ని కలుస్తాను" అని నటి అచ్యస సిన్హా తెలిపింది.

Whats_app_banner