Hanuman Budjet: హనుమాన్ మూవీ.. అనుకున్న బడ్జెట్ ఎంత - ఫైనల్‌గా ఎంతయ్యింది - రివీల్ చేసిన ప్రశాంత్ వర్మ
Hanuman Budjet: హనుమాన్ మూవీ బడ్జెట్ తాము అనుకున్నదానికంటే మూడింతలు పెరిగిందని ప్రశాంత్ వర్మ అన్నాడు. హనుమాన్ అసలు బడ్జెట్ ఎంతన్నది ప్రశాంత్ వర్మ రివీల్ చేశాడు.
Hanuman Budjet: తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన హనుమాన్ మూవీ టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. పదిహేను రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 269 కోట్ల వసూళ్లను హనుమాన్ రాబట్టింది. సోమవారం నాటికి ఈ మూవీ 275 కోట్ల మార్క్‌ను టచ్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 9 వరకు హనుమాన్‌కు పెద్దగా పోటీ లేకపోవడంతో ఈజీగా ఈ మూవీ 300 మైలురాయిని దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంటోన్నాయి.
వీకెండ్ కారణంగా ఆదివారం రోజు పన్నెండు కోట్ల వసూళ్లను దక్కించుకొని హనుమాన్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది సోమవారం రోజు మాత్రం కలెక్షన్స్ కాస్తంత తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. మండే రోజు ఏడు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతోన్నారు. హిందీ వెర్షన్‌కు సంబంధించి హనుమాన్ మూవీ ఇప్పటివరకు 44 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. కేజీఎఫ్ రికార్డును బ్రేక్ చేసింది.కేవలం 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు వంద కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
హనుమాన్ బడ్జెట్ ఎంతంటే...
హనుమాన్ బడ్జెట్‌పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తొలుత హనుమాన్ సినిమాను 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని అనుకున్నామని తెలిపాడు. కానీ ఫైనల్‌గా నలభై కోట్లు అయ్యిందని అన్నాడు. మేము అనుకున్నదానికంటే మూడింతలు బడ్జెట్ పెరిగిందని పేర్కొన్నాడు. హనుమంతు ఇంట్రడక్షన్ పేరుతో తేజా సజ్జా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ మేము ఊహించిన దానికంటే ఎక్కువ రేటుకు అమ్ముడుపోయానని ప్రశాంత్ వర్మ చెప్పాడు. ఆ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్‌తోనే తాము ప్రాఫిట్స్‌లోకి అడుగుపెట్టినట్లు చెప్పాడు.
క్లైమాక్స్ సింపుల్‌గానే....
మిగిలిన భాషల నుంచి కూడా మంచి ఆఫర్స్ రావడంతో బడ్జెట్ పెంచుకుంటూ పోయామని ప్రశాంత్ వర్మ అన్నాడు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా 26 కోట్ల వరకు అమ్ముడుపోయాయని ప్రశాంత్ వర్మ తెలిపాడు. తొలుత మాకున్న బడ్జెట్ లిమిలేటేషన్స్ కారణంగా గ్రాఫిక్స్ విషయంలో క్లైమాక్స్‌ను సింపుల్‌గానే ఎండ్ చేయాలని అనుకున్నట్లు తేజా సజ్జా తెలిపాడు. ఎక్స్‌పెక్టేషన్స్, బడ్జెట్ పెరగడంతోనే భారీగా క్లైమాక్స్‌ను షూట్ చేశామని అన్నాడు.
జాంబీ రెడ్డి తర్వాత...
జాంబీరెడ్డి తర్వాత తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో హనుమాన్ మూవీ రూపొందింది. అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సూపర్ హీరో కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. హనుమంతుడి సహాయంతో సూపర్ పవర్స్ పొందిన హనుమంతు అంజనాద్రిని ఎలా కాపాడాడు? ఆ సూపర్ పవర్స్‌ను సొంతం చేసుకోవడానికి మైఖేల్ అనే వ్యక్తి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అన్నదే ఈ మూవీ కథ. హనుమాన్‌లో తేజా సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించింది. వినయ్ రాయ్ విలన్‌గా నటించాడు.
హనుమాన్ మూవీ సీక్వెల్...
హనుమాన్ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్నది. మార్చి సెకండ్ వీక్ నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. హనుమాన్ మూవీకి సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కుతోంది. ఇటీవలే అఫీషియల్‌గా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలుపెట్టారు. 2025లో జై హనుమాన్ మూవీ రిలీజ్ కానుంది.