Prasanth Varma: రవితేజతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్.. హనుమాన్ డైరెక్టర్ కామెంట్స్
Prasanth Varma Ravi Teja Cinematic Universe: తాజాగా శనివారం నాడు హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో రవితేజతో సినిమాటిక్ యూనివర్స్ చేయాలని ఉందని మనసులో మాట చెప్పేశాడు ప్రశాంత్ వర్మ. దీన్ని ఒక పాత్రతో ముందుకు తీసుకుపోతామని తెలిపాడు.
Prasanth Varma About Ravi Teja: యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తొలి తెలుగు సూపర్ హీరో మూవీ హనుమాన్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాదు క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ఇటీవలే రూ. 250 కోట్లు కలెక్ట్ చేసింది హనుమాన్. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం (జనవరి 27) హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

తేజ పర్ఫెక్ట్ యాప్ట్
"అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ప్రోత్సహించిన అమ్మానాన్నలకు కృతజ్ఞతలు. నిరంజన్ గారు లాంటి నిర్మాత దొరకడం మా అదృష్టం. చాలా గ్రాండ్‌గా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడాని సపోర్ట్ చేశారు. నేను తేజ చాలా కాలంగా ప్రయాణిస్తున్నాం. తేజ చాలా మంచి యాక్టర్. చాలా కష్టపడి ఈ సినిమా కోసం పని చేశాడు. తను చాలా పరిణతి గల వ్యక్తి. ఈ సినిమాకి తేజ పర్ఫెక్ట్ యాప్ట్ అని విడుదలకు ముందు చెప్పాను. ఇప్పుడు చూసి ప్రేక్షకులు అదే మాట చెప్పడం ఆనందంగా ఉంది" అని ప్రశాంత్ వర్మ తెలిపాడు.
ఆమె లక్కీ చార్మ్
"ఈ సినిమాతో తేజ సూపర్ హీరో అయ్యాడు. ఫ్రెండ్‌ని హీరో చేయడం ఒక తృప్తి. ఫ్రెండ్‌ని స్టార్ చేయడం ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. తనని ఈ స్థాయిలో చూడటం చాలా సంతోషంగా ఉంది. అమృత చాలా చక్కని నటన కనపరిచింది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారు సంక్రాంతికి లక్కీ చార్మ్. ఆమెతో వర్క్ చేయడం మంచి అనుభూతి. వినయ్ రాయ్ తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. గెటప్ శీను, సత్య, వెన్నెల కిషోర్ గారు, రోహిణీ గారు, రామ్ గారు, రాకేశ్ మాస్టర్ అందరూ చాలా చక్కగా చేశారు. వారి పాత్రలని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు" అని ప్రశాంత్ వర్మ అన్నాడు.
రవితేజపై అనుమానం ఉండేది
"మాస్ మహారాజా రవితేజ గారు హనుమాన్‌లో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా సినిమాలో మోస్ట్ ఎంటర్టైనింగ్ చేసిన రవితేజ గారికి కృతజ్ఞతలు. కోటి క్యారెక్టర్‌కు రవితేజ గారు ఇచ్చిన వాయిస్‌ని ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తానని మూడేళ్ల క్రితమే నాకు మాటిచ్చారు. కానీ, ఆయన నటించిన ఈగల్ మూవీ మా సినిమాతో పాటే ఒకే టైమ్‌లో విడుదలకు ఉంది. వాయిస్ ఇస్తారా లేదా, అసలు అడిగితే బాగుంటుందా, ఇంకేమైనా చేద్దామా అని ఆలోచించాను" అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు.
యూనివర్స్‌లో మూవీ
చివరకు డౌట్ ఫుల్ గానే కోటి పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తారా అని అడిగా. దానికి వెంటనే సరేరా చేసేద్దాం అన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో సపోర్ట్ చేసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది ఇంత జెన్యూన్ పర్సన్ నాకు దొరకడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో భాగమైనందుకు రవితేజ గారికి థ్యాంక్స్. కోటి పాత్రని ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో ముందుకు తీసుకెళ్లలా అని ఆలోచన వస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చింది. రవితేజ గారు ఒప్పుకుంటే ఆయనతో ఈ యూనివర్స్‌లో ఒక సినిమా చేయాలని ఆశిస్తున్నాం" అని మనసులో మాట బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ.