తెలుగు న్యూస్ / ఫోటో /
Prasanna Vadanam OTT Release: ఈవారంలోనే ఓటీటీలోకి ప్రసన్నవదనం సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?
- Prasanna Vadanam OTT Release: ప్రసన్నవదనం సినిమా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వివరాలు ఇవే..
- Prasanna Vadanam OTT Release: ప్రసన్నవదనం సినిమా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వివరాలు ఇవే..
(1 / 5)
యంగ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం సినిమా ఫేస్ బ్లైండ్‍నెస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ థ్రిల్లర్ మూవీ మే 3వ తేదీన థియేటర్లలో రిలీజై మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
(2 / 5)
ప్రసన్నవదనం చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 24వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై ఆహా అధికారిక ప్రకటన కూడా చేసింది.
(3 / 5)
ఆహా గోల్డ్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న యూజర్లు 24 గంటలు ముందుగానే అంటే మే 23వ తేదీ నుంచే ప్రసన్నవదనం చిత్రాన్ని చూడొచ్చు. అయితే, సాధారణ ప్లాన్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారు ఆహాలో మే 24 నుంచి ఈ మూవీని వీక్షించొచ్చు.
(4 / 5)
ప్రసన్నవదనం చిత్రానికి అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. తన శిష్యుడు అర్జున్ తెరకెక్కించటంతో ఈ సినిమా ప్రమోషన్లలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా పాల్గొన్నారు. దీంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది.
ఇతర గ్యాలరీలు